Shoaib Akhtar And Harbhajan Singh In ILT20 Commentary Box: ఇండియా, పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితిలు ఉన్నాయి. పహాల్గామ్ సంఘటన తర్వాత రెండు దేశాల మధ్య గ్యాప్ మరింత పెరిగింది. ఇరు జట్ల క్రికెటర్లు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోవడం లేదు. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లతో కలిసి కామెంట్రీ చేశాడు. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 2026 టోర్నమెంట్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో హర్భజన్ సింగ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అతన్ని దేశద్రోహి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి రచ్చ రచ్చ చేస్తున్నారు.
ఇంటర్నేషనల్ లీగ్ టీ20 2026 టోర్నమెంట్ (International League T20 2026 ) ప్రారంభమైన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhta)… షోయబ్ మాలిక్ లతో కలిసి హర్భజన్ సింగ్ (Harbhajan Singh ) సందడి చేశాడు. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో మైదానంలో పాకిస్తాన్ ప్లేయర్లతో కలిసి సరదాగా గడిపాడు. ఆ తర్వాత షోయబ్ అక్తర్ తో కలిసి కామెంట్రీ బాక్స్ లో కనిపించాడు. హర్భజన్ సింగ్ తో పాటు నవజ్యోత్ సింగ్ సిద్దూ వకార్ యూనిస్ కూడా ఇందులో భాగమయ్యారు.
అయితే పాకిస్తాన్ మాజీ క్రికెటర్లతో గతంలో టీమిండియా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హర్భజన్ సింగ్ కనిపించడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. పాకిస్తాన్ కుక్కలతో హర్భజన్ సింగ్ పనేంటి? అంటూ ఫైర్ అవుతున్నారు. పాక్ కుక్కులకు టీమిండియా క్రికెటర్లు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడం లేదని.. కానీ హర్భజన్ సింగ్ లాంటి వాళ్లు, ఆ వెధవలతో కామెంట్రీ కూడా చేస్తున్నారంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. ఇలాంటి వాళ్లను దేశం నుంచి తరిమి కొట్టాలని కోరుతున్నారు.
ఇంటర్నేషనల్ లీగ్ టీ20 2026 టోర్నమెంట్ నవంబర్ 21వ తేదీ అంటే నిన్నటి రోజున ప్రారంభమైంది. ఈ మెగా టోర్నమెంట్ డిసెంబర్ 20వ తేదీ వరకు కొనసాగుతుంది. దాదాపు నెల రోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నమెంట్ లో 34 మ్యాచులు నిర్వహిస్తారు. ప్రతి మ్యాచ్ రాత్రి 8 గంటలకు షురూ అవుతుంది. డబుల్ హెడర్ మ్యాచ్ లు ఉంటే… ఆ రోజున మధ్యాహ్నం మూడున్నరకే మొదటి మ్యాచ్ ఉండనుంది. రెండో మ్యాచ్ రాత్రి 8 గంటలకు పెడతారు. ఈ టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచ్ లు అన్ని దుబాయ్ వేదికగా జరుగుతున్నాయి.