E-Paper
Advertisement

Mohammed Shami : షమీ సౌతాఫ్రికా ఫ్లయిట్ ఎక్కుతున్నాడా? లేదా?

Mohammed Shami : షమీ సౌతాఫ్రికా ఫ్లయిట్ ఎక్కుతున్నాడా? లేదా?
Advertisement

Mohammed Shami : సౌతాఫ్రికా టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు వెళ్లాల్సిన సీనియర్ ప్లేయర్లు ఫ్లయిట్ ఎక్కే సమయం ఆసన్నమైంది. అయితే అందరూ రెడీగా ఉన్నారు కానీ, చీలమండ గాయంతో ఎన్సీఏలో చికిత్స పొందుతున్న మహ్మద్ షమీ వెళ్లడం అనుమానస్పదంగా మారింది. అయితే బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన మూడు ఫార్మాట్ల ఆటగాళ్లు అక్కడే ఉన్నారు. టెస్ట్ మ్యాచ్ ఆడే సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ తదితరులు ఇండియాలోనే ఉండిపోయారు. డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్ కు వీరు బయలుదేరాల్సి ఉంది. అందరూ సన్నద్ధమవుతున్నారు. మరి వీరిలో షమీ వెళ్లడం డౌటే అంటున్నారు.

Advertisement

అయితే, తను అంతా ఫిట్ గానే ఉన్నాడని అంటున్నారు. కాకపోతే షమీ మాత్రం ఇంకొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే మళ్లీ తిరగబెట్టిందంటే ఇంక ఇప్పుడప్పుడే కోలుకోవడం కష్టం కాబట్టి, ఎన్సీఏలో ఉండి, వచ్చే టీ 20 వరల్డ్ కప్ నకు పూర్తిగా సర్వ సన్నద్ధుడు కావాలని అనుకుంటున్నాడు.

ఈ సిరీస్‌కు షమీ గానీ దూరమైతే అతని స్థానంలో మరో బౌలర్‍‌కు అవకాశం వచ్చేలా ఉంది. అయితే ఆల్రడీ అక్కడే ఉన్న టీ20, వన్డే జట్టులోని బౌలర్లనే తీసుకుంటారని అంటున్నారు. ఎందుకంటే ఆల్రడీ టీ 20 సిరీస్ అయిపోయింది. వారిలో అర్షదీప్ సింగ్ ఖాళీగానే ఉన్నాడు. అలాగే వన్డేలో ఆడే ఆవేష్ ఖాన్ పరిస్థితి అంతే. వీరిద్దరిలో ఒకరికి అవకాశం ఇవ్వవచ్చునని అంటున్నారు.

Advertisement

వీరిలో ఎవరినైనా తీసుకుంటే, టెన్షను ఉండదు. కాదు.. ఏ ఫార్మాట్ కి, ఆ ఫార్మాట్ అనుకుంటే మాత్రం ఇండియా-ఏ జట్టులోని ఆటగాళ్లను సౌతాఫ్రికా తీసుకువెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.  .

భారత్-సౌతాఫ్రికా టెస్టు సిరీస్ షెడ్యూల్..
తొలి టెస్ట్: డిసెంబర్ 26 నుంచి 30వరకు జరగనుంది.
రెండో టెస్ట్: జనవరి 3 నుంచి 7 వరకు జరగనుంది. అన్నీ కుదిరి వర్షం ఆటంకం లేకుండా ప్రశాంతంగా మ్యాచ్ లు జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు.

టెస్టులకు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్),  జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్,  శార్దుల్ ఠాకూర్, ముకేశ్ కుమార్, మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×