BigTV English

Miss World Contestants: ఐపీఎల్ మ్యాచ్ లకు మిస్ వరల్డ్ పోటీదారులు.. ఉప్పల్ లో ఫ్యాన్స్ కు పండగే

Miss World Contestants: ఐపీఎల్ మ్యాచ్ లకు మిస్ వరల్డ్ పోటీదారులు.. ఉప్పల్ లో ఫ్యాన్స్ కు పండగే

Miss World Contestants:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో… ఇప్పటివరకు 50 కి పైగా మ్యాచ్లు పూర్తయ్యాయి. మరికొన్ని మ్యాచులు జరగాల్సి ఉంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అలాగే పంజాబ్ కింగ్స్ జట్లు దాదాపు ప్లే ఆఫ్ బెర్తులను కన్ఫర్మ్ చేసుకున్నాయి. చెరో మ్యాచ్ గెలిస్తే, రెండు జట్లు కూడా నేరుగా అధికారికంగా ప్లే ఆఫ్ కు వెళ్తాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో ఐపీఎల్ 2025 టోర్నమెంట్ గురించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ చూసేందుకు మిస్ ఇండియా సెలబ్రిటీలు రాబోతున్నారు.


Also Read: Rishabh Pant: బల్లెం వదిలిన రిషబ్ పంత్.. నీరజ్ చోప్రా లాగా గోల్డ్ మెడల్ ఇవ్వాల్సిందే

మే 6వ తేదీ నుంచి మిస్ ఇండియా వరల్డ్ పోటీలు


హైదరాబాద్ మహానగరంలో ( Hyderabad City) మొదటిసారిగా మిస్ ఇండియా వరల్డ్ పోటీలు ( Miss World Contest) జరగబోతున్నాయి. మే ఆరో తేదీ నుంచి మిస్ ఇండియా వరల్డ్ పోటీలు జరుగుతాయి. మే 31వ తేదీ వరకు ఈ ఈవెంట్ జరగనుంది. జూన్ రెండవ తేదీ అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా… మిస్ ఇండియా వరల్డ్ పోటీలో విన్నెర్స్ కు మంచి ట్రీట్ ఉంటుంది. గవర్నర్ నివాసంలో వాళ్లకు విందు కూడా ఉంటుందని తెలుస్తోంది.

ఐపీఎల్ మ్యాచ్లకు అటెండ్ కానున్న.. మిస్ ఇండియా సెలబ్రిటీలు

హైదరాబాదులో మే ఆరో తేదీ నుంచి జరగబోతున్న మిస్ ఇండియా వరల్డ్ పోటీల కోసం… 120 దేశాల నుంచి కంటెస్టెంట్స్ ( Miss World Contestants ) రాబోతున్నారు. అయితే… ఈ సెలబ్రిటీలందరూ ఐపిఎల్ ఈవెంట్ కు కూడా హాజరు కాబోతున్నారు. దాదాపు నెల రోజులు హైదరాబాదు లో ఉండనున్న కంటెస్టెంట్స్…. మే 20వ తేదీ అలాగే మే 21వ తేదీన జరగబోయే మ్యాచ్లకు…. హాజరుకానున్నారు. మే 20వ తేదీన ఐపీఎల్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన క్వాలిఫైయర్ మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో ( Rajiv Gandhi International Stadium, Hyderabad ) జరగనుంది.

Also Read: MLA Kaushik meets KL Rahul: రాహుల్ ను కలిసిన కౌశిక్ రెడ్డి..పింక్ కండువా కప్పేసాడు !

సాయంత్రం ఏడున్నర గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్కు ఈ సెలబ్రిటీలు హాజరవుతారు. అలాగే ఎలిమినేటర్ మ్యాచ్ ( ipl 2025 Eliminator match )మే 21వ తేదీన ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్కు కూడా మిస్ ఇండియా వరల్డ్ పోటీల కోసం వచ్చిన కంటెస్టెంట్స్ హాజరవుతారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది. అయితే క్వాలిఫైయర్ మొదటి మ్యాచ్ అలాగే ఎలిమినేటర్ ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. మరో వారం రోజుల్లో ఈ ప్రక్రియ పైన క్లారిటీ వస్తుంది. అయితే ఐపిఎల్ 2025 టోర్నమెంట్ చూసేందుకు మిస్ ఇండియా కంటెస్టెంట్స్ వస్తున్న నేపథ్యంలో… ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

Related News

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Dhoni on Virat : కోహ్లీ పెద్ద జోకర్.. ధోని హాట్ కామెంట్స్ వైరల్!

Big Stories

×