Lashkar-e-Taiba: జమ్ముకశ్మీర్ లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి విచారణలో కుల్గాం ప్రాంతానికి చెందిన ఇంతియాజ్ అహ్మద్ లష్కరే తోయిబా స్లీపర్ సెల్ సభ్యుడిగా అనుమానించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టెర్రర్ అటాక్‌కు సంబంధించి జరిపిన విచారణలో ఇంతియాజ్ పాత్ర బయటపడిందని పోలీసులు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా ఇంతియాజ్ అహ్మద్ లష్కర్ రహస్య స్థావరం గురించి తనకు తెలుసునని ఒప్పుకున్నట్టు పోలీసు అధికారులు పేర్కొన్నారు.
ఆ తర్వాత ఇంతియాజ్ అహ్మద్ చెప్పిన ప్రదేశానికి తీసుకెళ్లామని.. అప్పుడు తమ దగ్గర నుంచి తప్పించుకోవడానికి వైషో వాగులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు వివరించారు. ఆ తర్వాత కొద్దీ దూరంలో ఇంతియాజ్ అహ్మద్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని వీడియో ఫుటేజీని పోలీసులు అధికారులు విడుదల చేశారు. అయితే, మొదట ఈ ఘటనకు భద్రతా బలగాలే కారణమని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వచ్చాయి. తాజాగా బయటకు వచ్చిన ఫుటేజీ వీడియోలో ఇంతియాజ్ అహ్మద్ తనకు తాను గానే నదిలో దూకి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు క్లారిటీ వచ్చింది.
పోలీసు అధికారులు రిలీజ్ చేసిన వీడియోలో ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే (23) భద్రతా బలగాల నుంచి తప్పించుకునే క్రమంలో నదిలోకి దూకుతుననట్టు తెలిసింది. రెండు రోజుల క్రితం మాగ్రేను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. పోలీసుల విచారణలో భాగంగా కుల్గాంలోని టాంగ్‌మార్గ్ లోని అడవిలో దాక్కున్న ఉగ్రవాదులకు ఫుడ్, లాజిస్టిక్స్ ఇచ్చానని పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది.
Indian Army zeroed in on Over Ground Worker Imtiaz Ahmad Magray of terrorists.
He confessed that he knows the location of terrorist hideouts.
He was guiding Army to the hideouts during search operations.
He attempted to escape & jumped into Vishaw Nallah in Watoo Aharbal,… pic.twitter.com/mHVmZL3ry7
— Incognito (@Incognito_qfs) May 4, 2025
విచారణ అనంతరం ఉగ్రవాదులు దాక్కున్న ప్రదేశానికి భద్రతా దళాలను తీసుకెళతానని పోలీసులను నమ్మించాడు. దీంతో నిన్న ఉదయం పోలీసులు, ఆర్మీ బలగాలు అతనితో పాటు వెళ్లాయి. ఈ క్రమంలోనే ఇంతియాజ్ అహ్మద్ పారిపోయే ప్రయత్నంలో వైషో నదిలోకి దూకాడు. అయితే, నదిలో వరద ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడంతో అతడు కొట్టుకుపోయి మునిగిపోయాడు. ఆ వీడియోలో ఆ వ్యక్తి ఈత కొట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ బలమైన ప్రవాహంలో అతను కొట్టుకుపోయి మృతిచెందాడు.
Also Read: Putin call to PM Modi: ఇండియా- పాకిస్థాన్ వార్.. రష్యా మద్దతు ఎవరికంటే?
అయితే, ఈ ఘటనకు సంబంధించి ముందు తప్పుడు ప్రచారం జరిగింది. ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే మరణం వెనుక కుట్ర ఉందని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తీవ్ర ఆరోపణలు చేశారు. కుల్గాంలోని నది నుంచి మరో డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారని అన్నారు. శనివారం రోజున ఇంతియాజ్ మాగ్రేను సైన్యం తీసుకెళ్లిందని, ఇప్పుడు అతని మృతదేహం నదిలో కనిపించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇది కచ్చితంగా భద్రతా బలగాల తీవ్రమైన దుశ్చర్య అని ముఫ్తీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే, ఎవరి ప్రమేయం లేకుండా ఇంతియాజ్ అహ్మద్ నదిలోకి దూకుతున్నట్లు ఉన్న వీడియో బయటకు రావడంతో ఘటనలో భద్రతా బలగాల ప్రమేయం లేదని తేలింది.
Also Read: Indian Military Academy: గుడ్‌న్యూస్.. ఇండియన్ మిలిటరీ అకాడమీలో ప్రవేశాలు.. ఈ అర్హతలు ఉంటే చాలు..!