E-Paper
Advertisement

Mohsin Naqvi: పెట్రోల్ కోసం ఇండియాలో జ‌నాలు కొట్టుకుచ‌స్తున్నారు..మా పాకిస్తాన్ లో ఆ ప‌రిస్థితి లేదు

Mohsin Naqvi: పెట్రోల్ కోసం ఇండియాలో జ‌నాలు కొట్టుకుచ‌స్తున్నారు..మా పాకిస్తాన్ లో ఆ ప‌రిస్థితి లేదు
Advertisement

Mohsin Naqvi:  ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య నిత్యం ఏదో ఒక వివాదం రాజు కుంటూనే ఉంటుంది. తాజాగా ఇండియాలో పెట్రోల్ పరిస్థితులపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ ( PCB) మొహ్సిన్ న‌ఖ్వీ ( Mohsin Naqvi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో పెట్రోల్ కోసం జనాలు కొట్టుకు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే పాకిస్తాన్ లో మాత్రం అలాంటి పరిస్థితి లేదని క్లారిటీ ఇచ్చారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్, పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ల మధ్య వ్యత్యాసాన్ని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ పెట్రోల్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు మొహ్సిన్ న‌ఖ్వీ. దీంతో మొహ్సిన్ న‌ఖ్వీ చేసిన‌ వ్యాఖ్యలు దుమారం వేపుతున్నాయి.

Also Read: Rohit VS Bumrah: ముంబైలో చీలిక‌..రోహిత్ శ‌ర్మ‌ను బండ బూతులు తిట్టిన బుమ్రా, రూ.50 లక్ష‌ల ఫైన్‌

ఇండియాలో పెట్రోల్ కోసం జనాలు చచ్చిపోతున్నారు – మొహ్సిన్ న‌ఖ్వీ

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్, అటు పాకిస్తాన్ సూపర్ లీగ్ రెండు కూడా ఒకేసారి జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రేక్షకులతో నిండుగా ఐపీఎల్ మెరుస్తుంటే.. పాకిస్తాన్ సూపర్ లీగ్ మాత్రం ప్రేక్షకులు లేకుండానే విలవిలలాడుతోంది. పెట్రోల్, డీజిల్ కొరత ఉన్న నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నిర్వహిస్తోంది PCB బోర్డు. కానీ ఇండియాలో ఆ సమస్య లేకపోవడంతో ప్రేక్షకులతోనే ఐపిఎల్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ విషయంపై ఇండియాను బ్లేమ్ చేసేందుకుగాను, త‌మ చేత‌కానీ త‌నాన్ని క‌ప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ న‌ఖ్వీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ లో చమురు నిల్వలు విపరీతంగా ఉన్నాయని.. తమ దగ్గర పెట్రోల్ కు కొరత లేదని వెల్లడించారు.

కానీ ఇండియాలో మాత్రం ఇంధన కొరత స్పష్టంగా కనిపిస్తోందని బాంబు పేల్చారు. ఇండియాలోని పెట్రోల్ బంక్ దగ్గర వేలాది మంది జనాలు క్యూ కడుతున్నారు.. ఇంధనం కోసం ఎగబడుతున్నారు.. కొంతమంది కొట్టుకు చేస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. తాము పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటును ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తూ, ఇక్కడి జనాలకు మాత్రం మెరుగైన సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. పెట్రోల్ కోసం జనాలు బంకుల్లో ఎదురు చూడకుండా PSL ను బలి చేశామని పరోక్షంగా చెప్పారు. కానీ ఇండియా సర్కార్ మాత్రం జనాలకు ఇంధనం అందించడంలో విఫలమైందని మండిపడ్డారు.

ఇండియాలో పెట్రోల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయి – కేంద్రం

Advertisement

మొహ్సిన్ న‌ఖ్వీ చేసిన వ్యాఖ్యలను నేపథ్యంలో ఇండియాలో ఇంధన కొరత పైన కేంద్ర ప్రభుత్వం కూడా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇండియాలో పాకిస్తాన్ మిషన్ కక్కినట్లుగా ఇంధన కొరత ఏమాత్రం లేదని వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకుగాను, పాకిస్తాన్ విషం కక్కుతోందని కేంద్రం మండిపడింది. ఈ మాటలు నమ్మి జనాలు మోసపోకూడదని కోరింది. తమ చేతకానితనాన్ని, ఇండియా పై మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Also Read: ఐపీఎల్ నుంచి PSLలోకి రావ‌డానికి సిగ్గు అనిపించలేదా ? కుశాల్ మెండిస్ ప‌రువు తీసిన పాక్ రిపోర్ట‌ర్‌

 

 

Related News

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

Big Stories

Advertisement
×