BigTV English
Advertisement

OTT Movie : ఈ వాటర్ లో అడుగు పెడితే ఎముక కూడా మిగలదు… ఈ మూవీని చూశాక జన్మలో నీళ్ల జోలికి వెళ్ళరు

OTT Movie : ఈ వాటర్ లో అడుగు పెడితే ఎముక కూడా మిగలదు… ఈ మూవీని చూశాక జన్మలో నీళ్ల జోలికి వెళ్ళరు

OTT Movie : పిరానా చేపల పేరు వింటేనే ఒళ్ళు జలదరిస్తుంది. మనుషులను సైతం ముక్కలు చేసే ఈ చేపలంటే ఇప్పటికీ మనుషులు భయపడతారు. వీటిని ఉపయోగించి మూవీ కూడా చేశారు. మొదటి పార్ట్ సూపర్ హిట్ అవడంతో రెండో పాట కూడా తీశారు. అయితే ఈ సినిమాను సీరియస్ గా కాకుండా కామెడీని జోడించారు. ఓవైపు రక్తపాతం జరుగుతూనే, మరోవైపు కామెడీతో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేశారు మేకర్స్. ఇది ఓటిటి లో కూడా అందుబాటులోనే ఉంది. ఇప్పుడు ఈ మూవీ వివరాలు తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ హారర్ కామెడీ మూవీ పేరు ‘పిరాన్హా 3DD’ (Piranha 3DD). 2012 లో విడుదలైన ఈ మూవీకి జాన్ గులేగర్ దర్శకత్వం వహించారు. ఇది 2010 లో విడుదలైన “పిరానా 3D” సినిమాకు సీక్వెల్‌గా వచ్చింది. ఇందులో డేనియల్ పనాబేకర్, మాట్ బుష్, డేవిడ్ కోచ్నర్, క్రిస్ జిల్కా, కత్రినా బౌడెన్, క్రిస్టోఫర్ లాయిడ్ నటించారు. ఇందులో మాంసాహార పిరాన్హాలు, అరిజోనాలో కొత్తగా తెరిచిన వాటర్ పార్క్‌పై దాడి చేస్తాయి. అక్కడ భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. ఈ చేపల వల్ల ఒక పెద్ద రక్తపాతమే జరుగుతుంది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

మొదటి పార్ట్ లో లేక్ విక్టోరియాలో జరిగిన రక్తపాతం నుండి, ఒక సంవత్సరం గడిచిన తరువాత స్టోరీ మొదలవుతుంది. ఈసారి స్టోరీ ‘బిగ్ వెట్’ అనే ఒక పెద్ద వాటర్ పార్క్‌లో జరుగుతుంది. ఈ పార్క్‌ను చెట్ అనే ఒక వ్యాపారవేత్త నడుపుతుంటాడు. అతను దానిని ఒక అద్భుతమైన వినోద కేంద్రంగా మార్చాలని ప్లాన్ చేస్తాడు.  అతని సవతి కూతురు అయిన మాడీ అతని ప్లాన్‌లను వ్యతిరేకిస్తుంది. ఆమె స్నేహితులైన బారీ, కైల్‌తో కలిసి ఈ పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇంతలో పిరానా చేపలు, భూగర్భ జలమార్గాల ద్వారా వాటర్ పార్క్‌లోని పైపులలోకి చొచ్చుకొని వస్తాయి. ఈ మాంసాహార చేపలు మొదటి సినిమాలో కనిపించిన వాటి కంటే మరింత ప్రమాదకరంగా, పెద్దవిగా ఉంటాయి. వాటర్ పార్క్ గ్రాండ్ ఓపెనింగ్ రోజున, ఈ పిరాన్హాలు సందర్శకులపై దాడి చేస్తాయి. దీనివల్ల అక్కడ భయంకరమైన గందరగోళం, రక్తపాతం సంభవిస్తుంది. మాడీ, ఆమె స్నేహితులు ఈ పిరానాల నుండి తప్పించుకుంటూ, వాటిని ఆపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఎంత కట్టడి చేసినా వాటి భయంకరమైన పళ్ళు, మనుషులను ముక్కలు చేసి పడేస్తాయి. చివరికి వీటినుంచి మాడీ, ఆమె స్నేహితులు బయట పడతారా ? ఆ చేపలు అక్కడికి ఎలా వచ్చాయి ? వాటిని ఎలా కట్టడి చేస్తారు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే,ఈ హారర్ కామెడీ మూవీని మిస్ కాకుండా చూడండి. ఈ సినిమా లో హారర్, కామెడీని కలిపి చూపించారు. ఇందులో రక్తపాతం, కామిడీ , కొన్ని శృంగార సన్నివేశాలు కూడా ఉంటాయి.

Related News

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

OTT Movie : ఊహించిన దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘మాస్ జాతర’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : సోదరిని వెతుక్కుంటూ దెయ్యాల కొంపకు… నెక్స్ట్ ట్విస్ట్ కు గూస్ బంప్స్… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

Big Stories

×