Jofra Archer: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… పంజాబ్ కింగ్స్ తన తొలి ఓటమిని చవిచూసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… శనివారం రోజున పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య బీకర ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో… పంజాబ్ కింగ్స్ పైన రాజస్థాన్ రాయల్స్ ఏకంగా 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇది ఇలా ఉండగా… రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్ ఈ మ్యాచ్ నేపథ్యంలో చేసిన పని అందరిని ఆకట్టుకుంటుంది. ఈ మ్యాచ్ లో జోఫ్రా ఆర్చర్… అద్భుతమైన ప్రదర్శన చేసి మూడు… వికెట్లు తీశాడు.
వాస్తవానికి ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేసిన నేపథ్యంలో… ఆ సమయం మొత్తం జోఫ్రా అర్చర్ పడుకున్నాడు. మంచి దుప్పటి కప్పుకొని… దాదాపు గంట నిద్రపోయాడు. అప్పటికే రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ అయిపోయింది. ఇక పంజాబ్ ఇన్నింగ్స్ ప్రారంభించేసింది. దీంతో వెంటనే లేచి మొఖం కడుక్కొని బౌలింగ్ వేయడానికి వచ్చాడు జోఫ్రా ఆర్చర్. పడుకుని లేచి బౌలింగ్ చేసిన జోఫ్రా ఆర్చర్… పంజాబ్ కింగ్స్ నడ్డి విరిచాడు. తన మొదటి ఓవర్ లోనే పంజాబ్ కింగ్స్ కీలకమైన రెండు వికెట్లను పడగొట్టాడు జోఫ్రా ఆర్చర్. ప్రియాంష్ ఆర్య ను డక్ అవుట్ చేసిన జోఫ్రా ఆర్చర్… డేంజర్ ఫామ్ లో ఉన్న పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను కూడా… బౌల్డ్ చేశాడు. దీంతో పీకల్లోతు కష్టాల్లో పడింది పంజాబ్ కింగ్స్. అయితే… చివర్లో అర్షదీప్ సింగ్ వికెట్ కూడా పడగొట్టాడు ఆర్చర్. ఈ దెబ్బకు మొత్తం మూడు వికెట్లు తీశాడు.
ఈ టోర్నమెంట్ ప్రారంభంలో సన్రైజర్స్ హైదరాబాద్ తో తలపడింది రాజస్థాన్ రాయల్స్. అప్పుడు అత్యంత దారుణమైన ప్రదర్శన కనబరిచాడు జోఫ్రా ఆర్చర్. కానీ క్రమక్రమంగా తన బౌలింగ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ… సక్సెస్ అయ్యాడు. ఇక రాజస్థాన్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ లో అత్యున్నత ప్రదర్శన కనబరిచిన నేపథ్యంలో జోఫ్రా ఆర్చర్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. ప్రీతిజింటా చేతుల మీదుగా ఈ అవార్డు కూడా అందుకున్నాడు. ఇది ఇలా ఉండగా… ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్నిత 20 ఓవర్లలో ఏకంగా నాలుగు వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లలో యశస్వి జైష్వాల్ టచ్ లోకి వచ్చి 67 పరుగులు చేశాడు. సంజు 38 పరుగులు చేసి దుమ్ము లేపాడు. చివర్లో హెట్ మేయర్ 20 పరుగులు రియాన్ పరాగ్ 43 పరుగులు చేశారు. ఇక రాజస్థాన్ విధించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ కింగ్స్ దారుణంగా విఫలమైంది. రెండు మ్యాచ్లు వరుసగా విజయం సాధించిన పంజాబ్ కింగ్స్… రాజస్థాన్ రాయల్స్ చేతిలో మాత్రం దారుణంగా ఓడిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయిన పంజాబ్ కింగ్స్… 155 పరుగులు మాత్రమే చేసింది. దీంతో… ఈ మ్యాచ్ లో ఏకంగా 50 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవడం జరిగింది.
sleeping in dug out kinda day 😴 https://t.co/ty19uxcrk8 pic.twitter.com/MfzV7UkzbF
— Out Of Context Cricket (@GemsOfCricket) April 5, 2025