Pakistan: క్రికెట్ అభిమానులంతా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) చూస్తుంటే… పాకిస్తాన్ జట్టులో ( Pakisthan Team ) మాత్రం కల్లోలం నెలకొంటోంది. పాకిస్తాన్ జట్టు అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ఎప్పుడు చూసినా ఏదో పెద్ద వెంట పెట్టుకుంటూనే ఉంటారు పాకిస్తాన్ ఆటగాళ్లు ( Pakisthan Players). అయితే తాజాగా… సొంత దేశం అభిమానులతోనే ( Pakisthan Fans)… గొడవ పెట్టుకున్నారు పాకిస్తాన్ ప్లేయర్లు. అన్ని దేశాల క్రికెటర్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) ఆడుతుంటే… పాకిస్తాన్ ప్లేయర్లు మాత్రం.. న్యూజిలాండ్ బి ( New Zealand b ) జట్టుతో.. గెలిచేందుకు నాన కష్టాలు పడుతున్నారు.
Also Read: Tilak Varma: తిలక్ వర్మ వివాదం… రిటైర్డ్ హర్ట్.. రిటైర్డ్ ఔట్ తేడాలివే?
ఇప్పటికే న్యూజిలాండ్ చేతిలో టి20 సిరీస్ దారుణంగా ఓడిపోయిన పాకిస్తాన్ టీం… తాజాగా 3 వన్డే ల సిరీస్ కూడా కోల్పోయింది. అయితే మ్యాచ్ ఓడిపోయిన కోపంలో… పాకిస్తాన్ అభిమానులనే కొట్టేందుకు దూసుకు వెళ్ళాడు ఆ జట్టు ఆటగాడు ఖుష్దిల్ షా ( Khushdil Shah ). శనివారం రోజున పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా… మూడవ వన్డే ఓవల్ వేదికగా జరిగింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా… న్యూజిలాండ్ చేతిలో 43 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఓడిపోవడం జరిగింది. ఈ దెబ్బకు క్రికెట్ అభిమానులు మొత్తం డీలా పడిపోయారు. స్టేడియంలో ఉన్న పాకిస్తాన్ అభిమానులు… తమ జట్టు ప్లేయర్లనే బండ బూతులు తిట్టేస్తున్నారు. దద్దమ్మలు అంటూ మండిపడ్డారు.
అయితే పాకిస్తాన్ అభిమానుల బూతులు విన్న ఖుష్దిల్ షా ( Khushdil Shah )… తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. మొదట వాళ్ళు ఎంత తిట్టినా పట్టించుకోని ఖుష్దిల్ షా … ఆ తర్వాత రెచ్చిపోయాడు. అక్కడ ఉన్న అభిమానులపై దాడి చేసే ప్రయత్నం చేశాడు. అయితే పాకిస్తాన్ క్రికెటర్ ఖుష్దిల్ షా ( Khushdil Shah ) దాడి చేయడానికి గమనించిన పాకిస్తాన్ అభిమానులు… పసిగట్టి… ఎదురు దాడి చేయడం మొదలుపెట్టారు. అక్కడే ఉన్న వాటర్ బాటిల్స్ తో ( Water Bottles) కొట్టే ప్రయత్నం చేశారు అభిమానులు ( Pakisthan Fans). అయితే గొడవ పెద్దగా అవుతుందని వెంటనే రంగంలోకి దిగారు సెక్యూరిటీ బృందం సభ్యులు ( Security team members ). అనంతరం అభిమానులను అలాగే పాకిస్తాన్ క్రికెటర్ ఖుష్దిల్ షా ను… పక్కకు తీసుకువెళ్లారు. దీంతో అక్కడ వివాదం సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పాకిస్తాన్ ( Pakistan )పరువు పోయిందని సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ పెడుతున్నారు అభిమానులు. ఇక మన ఇండియన్స్ (Indians Fans) అయితే… పాకిస్తాన్ పరువు గంగలో కలిసిందని సెటైర్లు పేల్చుతున్నారు. ఇక ఈ సంఘటన పై పాకిస్థాన్ బోర్డు ఆరా తీస్తోందని అంటున్నారు.
Also Read: PAK vs NZ: మ్యాచ్ మధ్యలో అండర్ టేకర్ మూమెంట్..బ్యాట్స్ మెన్ జస్ట్ మిస్ ?
Pakistani Cricketer Khushdil Shah violently confronts Pakistani fans taunting Pakistani cricket team after Pakistan lost to Newzealand in the third ODI.
Situation further escalated and Khushdil and other Pakistani players were thrashed by the Afghanistan cricket fans present… pic.twitter.com/a7jBbkuG4C
— Amitabh Chaudhary (@MithilaWaala) April 5, 2025