BigTV English

MS Dhoni : వివాదంలో ధోనీ ఔట్… నాటౌట్ అంటూ ఫ్యాన్స్ ఫైర్ !

MS Dhoni : వివాదంలో ధోనీ ఔట్… నాటౌట్ అంటూ ఫ్యాన్స్ ఫైర్ !

MS Dhoni : ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా కేకేఆర్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ 103 పరుగులు చేసి 9 వికెట్లను కోల్పోయింది.  ఈ మ్యాచ్ లో రచిన్ రవీంద్ర 04, కాన్వె 12, త్రిపాఠి 16, విజయ్ శంకర్ 29, శివమ్ దూబె 31, అశ్విన్ 1, రవీంద్ర జడేజా 0, దీపక్ హుడా 0, ధోనీ 1, నూర్ అహ్మద్ 1, అంశుల్ కంబోజ్ 3 పరుగులు చేశారు. శివమ్ దూబె 31 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అయితే వాస్తవానికి కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ ఔట్ కాలేదని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.


చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ ఔట్ చర్చనీయాంశంగా మారింది. కోల్ కతా బౌలర్ సునీల్ నరైన్ వేసిన బంతికి ధోనీ LBW అయ్యాడు. వాస్తవానికి బౌలర్ అప్పీల్ చేయగానే అంపైర్ ఔట్ ఇచ్చారు. ధోనీ రివ్యూ కోరగా.. రిప్లై పరిశీలించిన థర్డ్ ఎంపైర్ ఔట్ గా ప్రకటించారు. అయితే రిప్లై లో బంతి బ్యాటు పక్క వైపు వెళ్తున్న క్రమంలో అల్ట్రా ఎడ్జ్ లో కాస్త హెచ్చు తగ్గులు ఉన్నట్టు వీడియోలో కనిపించాయి. దీంతో క్లియర్ ఎడ్జ్ అయిందని ఆయన నాటౌట్ అని పలువురు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. 689 రోజుల తరువాత కెప్టెన్ గా మైదానంలోకి అడుగుపెట్టాడు ధోనీ. IPL 2025 లో చెపాక్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ధోనీ వ్యవహరిస్తున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణం ఈ సీజన్ నుంచి వైదొలగడంతో ధోనీ తిరిగి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టారు. ఇక 43 ఏళ్ల ధోనీ ఇప్పటికే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే మొదటి అన్ క్యాప్డ్ కెప్టెన్ గా ధోనీ రికార్డులకెక్కాడు. బీసీసీఐ రూల్స్ ప్రకారం.. గత ఐదేళ్లలో అంతర్జాతీయ క్రికెట్ ఆడని ఏ ఆటగాడినైనా అన్ క్యాప్డ్ ప్లేయర్ గా పరిగణించవచ్చు. ధోనీ 2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లో న్యూజిలాండ్ పై చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. ధోనిని అన్ క్యాప్డ్ కోటాలో రూ.4కోట్లు వెచ్చించి చెన్నై ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది. ధోనీ కెప్టెన్ ఉన్న సమయంలో 2010, 2011, 2018, 2021, 2023లో ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీలను అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్.


ఎం.ఎస్. ధోనీ కెప్టెన్ ఉంటే  చెన్నై చెపాక్ స్టేడియంలో హ్యాట్రిక్ ఓటమి మిస్ అవుతుందని అభిమానులు అంతా ఆశించారు. కానీ కోల్ కతా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు త్వరత్వరగా ఔట్ అయ్యారు. దీంతో కేవలం 103 పరుగులు మాత్రమే చేయగలిగింది చెన్నై జట్టు. ఈ మ్యాచ్ లో కోల్ కతా జట్టు చాలా సులభంగా చెన్నై జట్టు నిర్దేశించిన టార్గెట్ ను ఛేదిస్తుందని చెప్పవచ్చు. ధోనీ కెప్టెన్సీలో జరుగబోయే మ్యాచ్ లోనైనా చెన్నై విజయం సాధించాలని కోరుకుందాం.

 

Related News

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Big Stories

×