BigTV English

MS Dhoni : ధోనీ హుక్కా పీలుస్తాడా? నిజమా?

MS Dhoni : ధోనీ హుక్కా పీలుస్తాడా? నిజమా?
MS Dhoni

MS Dhoni : మహేంద్ర సింగ్ ధోనీ చాలా క్రమశిక్షణ కలిగిన ఆటగాడిగా అందరికీ సుపరిచితం. ఎప్పుడూ తను డ్రింక్స్ చేయడం, మిగిలిన క్రికెటర్లలా  ఆ తరహా పార్టీలకు వెళ్లడం కనిపించదు. అంతేకాదు బయట కూడా ఎప్పుడూ హుందాగానే కనిపిస్తాడు. నలుగురికి ఆదర్శంగా ఉండాలని అనుకుంటాడు. ఒక హెయిర్ స్టయిల్ విషయంలో తప్ప, మరెందులోనూ ధోనీ తప్పు పట్టడానికి లేదు.


కానీ సడన్ గా హుక్కా పీలుస్తూ ఫొటోల్లో కనిపించే సరికి, నెట్టింట పెద్ద చర్చ మొదలైంది. ఏమిటి? ఎప్పుడూ లేనిది ధోనీ హుక్కా పీల్చడం ఏమిటని అంతా ఆరా తీయడం మొదలు పెట్టారు. తీరా చూస్తే తను రిషబ్ పంత్ సోదరి సాక్షి పంత్ వివాహానికి హాజరయ్యాడు. అప్పుడు కూడా సూట్ తోనే ఉన్నాడు.అందుకే అక్కడే బహుశా హుక్కా పీల్చి ఉంటారని మరికొందరు అంటున్నారు.

మరికొందరు అనేది ఏమిటంటే, తను యాడ్ ఫిల్మ్ షూటింగ్ లో పాల్గొన్నాడు. అందులో భాగంగానే హుక్కా పీల్చాడని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయినా పెళ్లిలో పదిమంది చూస్తుండగా ఇలా ఎవరైనా హుక్కా పీల్చుతారా? అని కొందరు వ్యాక్యానిస్తున్నారు.  అది సింథటిక్ స్మోక్ అని కొందరు అంటున్నారు.  వివరాలు తెలీకుండా మాట్లాడకూడదని కొందరు కామెంట్లు చేస్తున్నారు.


ఇటీవల ఎంసీ స్టాన్‌తో కలిసి ధోనీ యాడ్ షూటింగ్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. అప్పుడేమైనా అంటించాడా?అని కొందరు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ధోనీ హుక్కా పీల్చే ఫొటోల్లో వేసుకున్న సూట్, యాడ్ లో కూడా వేసుకున్నాడు. బహుశా అప్పుడే ఇది జరిగిందని అంటున్నారు.

చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన మాజీ ప్లేయర్ జార్జ్ బెయిలీ చేసిన వ్యాఖ్యలు తెరమీదకి వస్తున్నాయి.  ”ధోనీకి హుక్కా తాగడం ఇష్టం. తన రూమ్‌లో ఇది కనిపించేదని చెప్పిన మాటలు గుర్తు చేస్తున్నారు.  ఎవరైనా వస్తుంటే, తను వాటిని తీసి దాచేయాలని ఎప్పుడూ ప్రయత్నించలేదని బెయిలీ తెలిపాడు.

ధోనికి అత్యంత సన్నిహితంగా ఉన్నవారికి ఈ సంగతి తెలుసునని తెలిపాడు. ఒకవేళ కాల్చితే కాల్చాడు,  పీల్చితే పీల్చాడు.. తప్పేంటి? అని కొందరంటున్నారు. సడన్ గా ఇలా కనిపించేసరికి షాక్ అయ్యామని మరికొందరు వ్యాక్యానిస్తున్నారు.

Related News

Pathum Nissanka Six: నిస్సంక భ‌యంక‌ర‌మైన సిక్స్‌…తుక్కు తుక్కైన‌ కారు..త‌ల‌ప‌ట్టుకున్న గంభీర్‌

IND Vs SL : ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ లో సూపర్ ఓవర్… ఎవరు గెలిచారంటే

Asia Cup 2025 : ఆసియా కప్ ఫైనల్స్ కు ముందు షాక్…సూర్య, రవూఫ్‌కు 30% ఫైన్

IND Vs SL : 300కు పైగా పరుగులు.. అభిషేక్ శర్మ సరికొత్త రికార్డు.. శ్రీలంక టార్గెట్ ఎంత అంటే ?

Abhishek- Gambhir: అభిషేక్ శ‌ర్మ‌ను బండ‌బూతులు తిట్టిన గంభీర్‌..ఈ దెబ్బ‌కు ఉరేసుకోవాల్సిందే !

IND Vs SL : టాస్ గెలిచిన శ్రీలంక‌.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : ఇండియా వర్సెస్ పాక్ ఫైనల్..PVR సంచలన నిర్ణయం.. ఏకంగా 100 థియేటర్స్ లో

Asia Cup 2025 : ఒకే గొడుగు కిందికి పాకిస్తాన్, బంగ్లా ప్లేయర్స్… ఇద్దరు ఇండియాకు శత్రువులే.. క్రేజీ వీడియో వైరల్

Big Stories

×