BigTV English
Advertisement

KTR : లోక్ సభ ఎన్నికల బరిలో కేటీఆర్.. ఆ స్థానం నుంచి పోటీ..

KTR : శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్‌ఎస్ లోక్ సభ ఎన్నికలకు సిద్దం అవుతుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను ఎంపీక చేసి రంగంలోకి దింపేందుకు సిద్దం అవుతుంది. ఇందులో భాగంగా కేటీఆర్‌ను మల్కాజిగిరి లేదా సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో ఏదో ఒకచోట నుంచి పోటీ చేయించాలని పోటీ చెయాలని పార్టీ నేతలు కోరారు. లోక్ సభ స్థానానికి పోటీ చేయడానికి అనాశక్తి చూపించినట్టు సమాచారం.అలా అని పోటీ చేయ్యనని వ్యతిరేకించలేదు. కేసీఆర్ నిర్ణయం తర్వాత ఈ అంశంపై సృష్టత వస్తుందని పార్టీ ముఖ్యనేత ప్రకటించారు.

KTR : లోక్ సభ ఎన్నికల బరిలో కేటీఆర్.. ఆ స్థానం నుంచి పోటీ..

KTR : శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్‌ఎస్ లోక్‌సభ ఎన్నికలకు సిద్దం అవుతుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను ఎంపీక చేసి రంగంలోకి దింపేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా కేటీఆర్‌ను మల్కాజిగిరి లేదా సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేయించాలని పార్టీ నేతలు కోరారు. కానీ లోక్ సభ స్థానానికి పోటీ చేయడానికి కేటీఆర్ అనాశక్తి చూపించినట్టు సమాచారం. అలా అని పోటీ చేయడానికి వ్యతిరేకించలేదు. కేసీఆర్ నిర్ణయం తర్వాత ఈ అంశంపై స్పష్టత వస్తుందని పార్టీలో ఒక ముఖ్యనేత ప్రకటించారు.


కేటీఆర్‌ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తే జాతీయ స్థాయిలో బీఆర్‌ఎస్‌కి ప్రాధాన్యం వస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందడం వల్ల లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం చాలా ముఖ్యమని బీఆర్‌ఎస్ పార్టీ అభిప్రాయపడుతుంది.

దీనిలో భాగంగా అభ్యర్థుల ఎంపికలో పార్టీ అప్రమ్తతంగా అడుగులేస్తోంది. నియోజకవర్గాల వారీగా ముఖ్యనేతలతో సమావేశం నిర్వహిస్తుంది. వారి అభిప్రాయలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. 2018 శాసనసభ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన బీఆర్‌ఎస్ తర్వాత జరిగిన 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆ స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది. గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో కేవలం 9 స్థానాల్లో బీఆర్‌ఎస్ గెలుపొందింది. 4 బీజేపీ, 3 కాంగ్రెస్‌, హైదరాబాద్‌ లోక్‌సభ ఎంఐఎం కైవసం చేసుకుంది.


ఇటీవల శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 7 లోక్‌సభ స్థానాల 3 ప్రాంతాలలో మాత్రమే ఆధిక్యం సాధించింది. ఇందులో మూడింటిలో స్వల్ప ఆధిక్యం చూపించింది. 4 చోట్ల మాత్రమే ఎక్కువ ఆధిక్యాలు ఉన్నాయి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది కాబట్టి గెలుపు కోసం స్వల్ప ఆధిక్యాలు వచ్చిన లోక్‌సభ స్థానాలను దక్కించుకోవడానికి మరింత శ్రమపడాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు వహిస్తున్నట్టు తెలుస్తోంది. రానున్న రోజుల్లో పార్లమెంటులో కూడా క్రియాశీలంగా ఉండే నాయకుల అవసరం ఉందని భావించి కేటీఆర్‌ను ఎంపీ ఎన్నికల బరిలోకి దింపాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను బీఆర్‌ఎస్ గెలుచుకొంది. దీని పరిధిలో బీఆర్‌ఎస్ కు 9.38 లక్షల ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 5.83 లక్షలు, భాజపాకు 4.25 లక్షలు ఓట్లు వచ్చాయి.

సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో 6 బీఆర్‌ఎస్ గెలుచుకోగా.. ఒకటి ఎంఐఎం కైవసం చేసుకుంది. బీఆర్‌ఎస్ కు 4.63 లక్షలు, కాంగ్రెస్‌కు 2.8 లక్షలు, బీజేపీకి 2.16 లక్షల ఓట్లు వచ్చాయి. ఈ రెండు స్థానాల్లో ఏదో ఒక చోట నుంచి కేటీఆర్‌ పోటీ చేయవచ్చని సమాచారం. అయితే మల్కాజిగిరి నుంచి పోటీ చేయ్యడానికే ఎక్కువ అవకాశాలున్నాయి.

కరీంనగర్‌ స్థానం నుంచి మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ పోటీ చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నియోజకవర్గం పరిధిలో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ కంటే బీఆర్‌ఎస్ కి కేవలం 5వేల ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. ఈ స్థానం నుంచి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 7 సీట్లు కలిపి ఆ పార్టీకి మొత్తం 2.5 లక్షల ఓట్లు వచ్చాయి. ఇక్కడి అసెంబ్లీ స్థానాల్లో నాలుగింటిని కాంగ్రెస్‌ గెలుచుకుంది. ఇది బీజేపీ సిట్టింగ్‌ స్థానం కావడంతో ఇక్కడ త్రిముఖ పోటీ ఏర్పడనుంది.

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×