BigTV English

Civet Coffee : పిల్లి మలంతో కాఫీ.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదు.. ఎలా తయారు చేస్తారంటే?

Civet Coffee : పొద్దున్నే కడుపులో ఇంత కాఫీ గానీ, టీ గానీ పడకపోతే చాలా మందికి రోజు ప్రారంభం కాదు.కొందరికి టీ అలవాటు ఉంటే మరికొందరికి కాఫీ బాగా నచ్చుతుంది. ఇక కాఫీ పేరు వినగానే మనసుకు తాజాదనం, శక్తి వస్తుంది. కొంత మంది కాఫీకి ఎంతగా అలవాటు పడ్డారంటే..సరి కొత్త కాఫీల రుచి కోసం ప్రపంచ వ్యప్తంగా పర్యటిసున్నారు

Civet Coffee : పిల్లి మలంతో కాఫీ.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదు.. ఎలా తయారు చేస్తారంటే?

Civet Coffee : పొద్దున్నే కడుపులో ఇంత కాఫీ గానీ, టీ గానీ పడకపోతే చాలా మందికి రోజు ప్రారంభం కాదు. కొందరికి టీ అలవాటు ఉంటే మరికొందరికి కాఫీ బాగా నచ్చుతుంది. ఇక కాఫీ పేరు వినగానే మనసుకు తాజాదనం, శక్తి వస్తుంది. కొంత మంది కాఫీకి ఎంతగా అలవాటు పడ్డారంటే..సరి కొత్త కాఫీల రుచి కోసం ప్రపంచ వ్యప్తంగా పర్యటిసున్నారు. కప్పు కాఫీ కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. చాలా డబ్బు ఖర్చు పెట్టి మరీ కప్పు కాఫీ తాగుతుంటారు.


అయితే ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన, ఖరీదైనా కాఫీ ఏంటో మీకు తెలుసా? దానిని ఎలా తయారు చేస్తారో తెలిస్తే ఆశ్యర్యంతో కళ్లు బైర్లు కమ్మాల్సిందే..! ఈ కాఫీ పేరు కోపీ లువాక్. కప్పు కాఫీ ధర రూ.6000 వరకు ఉండొచ్చు. అసలు ఈ కాఫీని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ కోపీ లువాక్. ఇది సివెట్ లేదా పునుగు పిల్లి మలంతో తయారు చేస్తారు. ఈ పిల్లికి కోతిలాంటి పొడవాటి తోక ఉంటుంది. ఒక కప్పు కాఫీ దాదాపు రూ.6వేల వరకు ఇండొచ్చు. దుబాయ్, సౌదీ అరేబియా, యూరప్, యూఎస్ వంటి దేశాల్లో సివెట్ కాఫీకి మంచి డిమాండ్ ఉంది. ఈ కాఫీ 1కేజీ ధర రూ. 20 వేల నుంచి 25 వేల వరకు ఉంటుంది. మన దేశంలో కర్ణాకటలోని కొడగు జిల్లాలో ఈ కాఫీ దొరుకుతుంది. కిలో ధర రూ.50 వేల వరకు పలుకుతుంది ఇక్కడ.


ఈ పిల్లులు కాఫీ గింజలను చాలా ఇష్టంగా తింటాయి. ఇది కాఫీ చెర్రీని సగం మాత్రమే తింటుంది. ఎందుకుంటే పిల్లులు వాటిని పూర్తిగా జీర్ణించుకోలేవు. దానికి కారణం వాటి ప్రేగులలో జీర్ణ ఎంజైములు ఉండకపోవడమే. సరీగా జీర్ణం కాకపోవడం వల్ల పిల్లి మలం నుంచి జీర్ణం కాని భాగం బయటకు వస్తుంది.

అప్పుడు వాటిని బాగా శుభ్రం చేసి.. సూక్ష్మజీవుల తొలగిపోయేలా పూర్తిగా శుభ్రం చేస్తారు. అనంతరం వాటిని ఆరబెట్టి, కాల్చిన తరువాత కాఫీ తయారు చేస్తారు. ఇలా కాఫీ గింజలు ఆ పిల్లి పేగుల నుంచి బయటకు వెళ్లిన తరువాత.. బీన్స్‌లోని ప్రోటీన్ కూర్పు మారి మరింత మెరుగ్గా, పోషకమైనదిగా కాఫీ తయారవుదుందని నేషనల్ జియోగ్రాఫిక్ నివేదిక పేర్కొంది.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×