Mulder-Lara Record: సౌత్ ఆఫ్రికా వర్సెస్ జింబాబ్వే మధ్య రెండో టెస్ట్ కొనసాగుతోంది. బులవయో లోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య రెండో టెస్ట్ కొనసాగుతోంది. అయితే ఈ టెస్ట్ లో కూడా పూర్తిగా సౌత్ ఆఫ్రికా ఆధిపత్యం చలాయిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో… ఈ మ్యాచ్ లో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. సౌత్ ఆఫ్రికా తాత్కాలిక కెప్టెన్ మల్డర్ చేసిన పని అందరిని… ఆకట్టుకుంటుంది. అతడు తీసుకున్న నిర్ణయం పట్ల మాజీ క్రికెటర్లు అలాగే క్రికెట్ అభిమానులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా రికార్డు చెక్కుచెదరకుండా… సౌత్ ఆఫ్రికా తాత్కాలిక కెప్టెన్ మల్డర్ ( mULDER) కాపాడారు. ఆ రికార్డు బద్దలు కొట్టే ఛాన్స్ వచ్చినప్పటికీ కూడా… చేజేతుల వదులుకున్నాడు. అతనికి గౌరవం ఇస్తూ డిక్లేర్ ప్రకటించాడు.
Also Read: HBD MS Dhoni: బయటపడ్డ ధోని భాగోతం…హీరోయిన్ జీవితం నాశనం.. పిల్లలు పుడితే…. ?
లారా కోసం మల్డర్ భారీ త్యాగం
సౌత్ ఆఫ్రికా వర్సెస్ జింబాబ్వే మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లోనే దక్షిణాఫ్రికా భారీ స్కోర్ చేసింది. 114 ఓవర్లు ఆడిన సౌత్ ఆఫ్రికా…. ఐదు వికెట్లు నష్టపోయి 626 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ మల్డర్ త్రిపుల్ సెంచరీ చేశాడు. 334 బంతుల్లో 367 పరుగులు చేశాడు. ఇందులో 49 బౌండరీలు అలాగే నాలుగు సిక్సర్లు ఉన్నాయి. మొత్తం జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించి… 367 పరుగులు పిండుకున్నాడు. అయినప్పటికీ నాట్ అవుట్ గా నిలిచాడు. 400 పరుగులు చేసే అవకాశం ఉన్నా కూడా మ్యాచ్ డిక్లేర్ చేశాడు మల్డర్. ఈ తరుణంలో.. 400 పరుగులు చేసి లారా రికార్డు బద్దలు కొడితే అయిపోవు కదా అని…మల్డర్ ను ఉద్దేశించి ఫైర్ అవుతున్నారు. మరో 33 పరుగులు చేస్తే సరిపోవు కదా… ఎందుకు అలా చేశావు అని మండిపడుతున్నారు. దీనిపై సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
లారా కోసమే ఆ పని చేశా
400 పరుగులు చేయకపోవడంపై తాజాగా మల్డర్… స్పందించడం జరిగింది. తన వ్యక్తిగత స్కోర్ 367
చేసిన తర్వాత డిక్లేర్ చేయడంపై క్లారిటీ ఇచ్చాడు దక్షిణాఫ్రికా కెప్టెన్ మల్డర్. అసలు ఆ పని చేయడం వెనుక కారణాన్ని తెలియజేశాడు. గెలవడానికి సరిపడా స్కోర్ చేశామని భావించామని ఈ సందర్భంగా వెల్లడించాడు మల్డర్. లారా ఒక లెజెండ్ లాంటి ప్లేయర్. ఆయన చేసిన రికార్డు అలాగే ఉండేందుకు… లారా మాత్రమే అర్హులు అని పేర్కొన్నారు. మరోసారి 400 కొట్టే ఛాన్స్ వచ్చినప్పటికీ కూడా తాను ఇదే నిర్ణయం తీసుకుంటానని వివరించాడు. కోచ్ శుక్రి కూడా ఇదే అన్నారని ఈ సందర్భంగా పేర్కొన్నాడు మల్డర్. Mulder-Lara Record