HBD MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేంద్ర సింగ్ ధోని టీమ్ ఇండియాకు ఎన్నో అఖండ విజయాలను సాధించి పెట్టాడు. అలాంటి మహేంద్ర సింగ్ ధోని పుట్టినరోజు ఈరోజు కావడంతో దేశవ్యాప్తంగా మహేంద్రసింగ్ ధోని అభిమానులు కేక్ కటింగ్ చేయడం లాంటి సెలబ్రేషన్స్ భారీ ఎత్తున జరుగుతున్నాయి. మహేంద్రసింగ్ ధోనికి తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మహేంద్ర సింగ్ ధోనికి సంబంధించిన భారీ కటౌట్ లను ఏర్పాటు చేశారు.
MS ధోని పుట్టినరోజున భారీ కటౌట్లు
33 అడుగుల భారీ కటౌట్ ను విజయవాడలో ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ధోని పుట్టినరోజున భారీ కటౌట్లను ఏర్పాటు చేసి సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. ఇక ధోనికి మాజీ క్రికెటర్లు ప్రస్తుతం ఉన్న క్రికెటర్లు అందరూ స్పెషల్ గా విషెస్ తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో ధోనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా…. ధోని టి20 ప్రపంచ కప్ గెలిచిన సమయంలో కొంతమంది హీరోయిన్లతో డేటింగ్ లో ఉన్నట్లుగా అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి. అందులో ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే, లక్ష్మీ రాయ్ కూడా ఉండడం విశేషం. బాలీవుడ్ బ్యూటీ దీపికతో కొన్ని రోజులపాటు ధోని డేటింగ్ చేసినట్లు అనేక రకాల వార్తలు వచ్చాయి. అంతేకాకుండా హీరోయిన్ లక్ష్మీరాయ్ తో కూడా డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
హీరోయిన్ లక్ష్మీరాయ్ తో ధోని డేటింగ్
అంతేకాకుండా వీరికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోని లక్ష్మీరాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. లక్ష్మీరాయ్ ధోనిపై సంచలన ఆరోపణలు చేశారు. ధోనితో డేటింగ్ లో ఉన్నట్లు గతంలో అనేక రకాల వార్తలు వచ్చాయని వాటి వల్లే తన కెరీర్ పూర్తిగా నాశనం అయిందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. భవిష్యత్తులో తన పిల్లలు ఈ విషయం గురించి మాట్లాడితే నేను ఏమని సమాధానం చెప్పాలి అంటూ లక్ష్మీరాయ్ బాధపడ్డారు. ధోని వల్లే తన కెరీర్ ఎండ్ అయినట్లుగా లక్ష్మీ రాయ్ అన్నారు. గతంలో లక్ష్మీ రాయ్ మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉండగా గతంలో… చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడుతున్న సమయంలోనే దీపిక పడుకునే తో మహేంద్ర సింగ్ ధోని రిలేషన్ పెట్టుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ సందర్భంగా ఇద్దరు పబ్బులు అలాగే పార్టీలకు తిరిగినట్లు చెబుతారు. ఇప్పటికి కూడా వీరి మధ్య ఉన్న రిలేషన్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. కానీ చివరికి సాక్షిని పెళ్లి చేసుకున్నాడు ధోని.