BigTV English

Mumbai Indians: మళ్లీ గాయపడ్డ హార్దిక్ పాండ్యా.. ఐపీఎల్ నుంచి ఔట్..?

Mumbai Indians: మళ్లీ గాయపడ్డ హార్దిక్ పాండ్యా.. ఐపీఎల్ నుంచి ఔట్..?

Hardik Pandya injury newsHardik pandya injury news(Latest sports news today): ఐపీఎల్ పండుగ ఆరంభానికి మరెన్నో రోజులు లేదు. గాయాలు పడినవారంతా నెమ్మదిగా జట్టులోకి వచ్చి చేరుతున్నారు. మరో వారం రోజుల్లో ప్రారంభం అవుతుందనగా ముంబై ఇండియన్స్ కి భారీ షాక్ తగిలింది. ఏరికోరి కెప్టెన్ గా తెచ్చుకున్న పాండ్యాకి ప్రాక్టీస్ మ్యాచ్ లో మళ్లీ గాయమైంది.


ఈ పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ కి మూలిగే నక్కపై తాటిపండు పడినట్టయ్యింది. ఎందుకంటే ఐపీఎల్ లో ఇప్పుడు రోహిత్ శర్మ ఆడటం లేదని చెప్పేశాడు. సూర్యకుమార్ ఆపరేషన్ చేయించుకుని ఉన్నాడు. ఇప్పుడు వివాదాలతో తెచ్చి పెట్టుకున్న పాండ్యా కూడా లేడు. కెప్టెన్ గా వద్దని, వదిలేసిన బుమ్రాయే మిగిలాడు.

అసలేం జరిగిందంటే… ప్రాక్టీస్‌లో హార్దిక్ పాండ్యా గాయపడిన ఒక వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ప్రాక్టీస్‌లో హార్దిక్ ఎడమకాలికి గాయమైనట్లు వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. బెంచ్‌పై పడుకున్న హార్దిక్‌కు ఫిజియో చికిత్స అందిస్తున్నాడు. ఫిజియోతో పాటు ముంబై బౌలింగ్ కోచ్ లసిత్ మలింగా కూడా అక్కడే ఉన్నాడు. హార్దిక్ గాయం తీవ్రత తక్కువగానే ఉన్నట్టు సమాచారం.


Also Read: T20 World Cup 2024: అమెరికాలో క్రికెట్ కి ఆదరణ పెరగాలంటే.. ఇండియా-పాక్ మ్యాచ్ తోనే సాధ్యం: రికీ పాంటింగ్

తను బాధల్లో తనుంటే నెటిజన్లు మాత్రం ట్రోల్ చేస్తున్నారు. క్రికెట్ లో గాయపడకుండా ఆడటం హార్దిక్ తెలుసుకోవాలని, లైఫ్ ని రిస్క్ లో పెట్టి బాల్ ని ఆపకూడదని అంటున్నారు. ఇంతమంది క్రికెటర్లు ఉన్నారు. ఒక డైవ్ చేస్తారంతే. క్యాచ్ వచ్చినప్పుడు మాత్రం దూరం నుంచే ట్రై చేస్తారు. అంతేకానీ బ్యాటర్ వేగంగా కొట్టే బాల్స్ ని కాళ్లతోనూ, చేతులతోనూ ఆపి ఎముకలు విరగ్గొట్టుకోరు…అని సలహాలిస్తున్నారు.

ఇన్ని వేలమంది టాప్ క్రికెటర్లు ఉన్నారు. ఎవరైనా ఇలా దెబ్బలు తగిలించుకుంటున్నారా..? అని ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రాక్టీస్ చేయడం, గాయపడటం, మ్యాచ్‌లకు దూరమవ్వడమే హార్దిక్ లైఫ్ స్టైల్ అని, ఈ గాయంతో ఐపీఎల్ 2024 సీజన్‌కు కూడా హార్దిక్ దూరమవుతాడని కామెంట్లు చేస్తున్నారు. బాధల్లో ఉన్న వ్యక్తిపై ఇటువంటి దాడి సరైనది కాదని నెటిజన్లు సూచిస్తున్నారు. కాగా, మార్చి 24న ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. మార్చి 27న ఉప్పల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పోటీపడనుంది.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×