BigTV English

MI Vs DC IPL 2024 Match Preview: హార్దిక్ భవిష్యత్ ను తేల్చే మ్యాచ్ ఇదేనా? నేడు ముంబయి వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్

MI Vs DC IPL 2024 Match Preview: హార్దిక్ భవిష్యత్ ను తేల్చే మ్యాచ్ ఇదేనా? నేడు ముంబయి వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్
MI Vs DC IPL 2024
MI Vs DC IPL 2024

IPL 2024 – MI Vs DC Match Preview & Prediction: ముంబై ఇండియన్స్.. ఎన్నో అంచనాలతో ఐపీఎల్ 2024 కొత్త సీజన్ లో అడుగుపెట్టింది. కానీ అంతకుమించి వివాదాలతో కొంప మీదకు తెచ్చుకుంది. ముఖ్యంగా అందరకు తెలిసిన విషయమే.. కెప్టెన్సీ వివాదం రచ్చరచ్చ అయ్యింది.


అందుకు తగినట్టుగానే పుండు మీద కారం జల్లినట్టు హ్యాట్రిక్ ఓటములతో తలబొప్పికట్టిన ముంబై ఇండియన్స్ కి నేడు ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగే మ్యాచ్ చావో రేవో అన్నట్టుగా మారింది. ఈ మ్యాచ్ ఓడిపోతే, హర్దిక్ పాండ్యా కెప్టెన్సీ ప్రమాదంలో పడినట్టేనని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ముంబై వాంఖేడీ స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది.


ఇప్పుడు నాలుగో మ్యాచ్ లోనైనా ముంబై ఇండియన్స్ విజయం సాధించి బోణీ కొట్టాలని చూస్తున్నారు. జట్టులో దిగ్గజాలైన ఆటగాళ్లు ఉండి కూడా గెలుపు బాట పట్టకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అంతర్గత విభేదాలను పక్కనపెట్టి జట్టు కోసం ఆడాలని సూచిస్తున్నారు.

Also Read: హేయ్ ప్రభూ.. ‘నా సీటు పోయింది.. మీకు ఏమైనా కనిపించిందా’..

ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 33 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో ఢిల్లీ 15 సార్లు గెలిచింది. ముంబై 18 సార్లు విజయం సాధించింది. ఈ గణాంకాలను బట్టి చూస్తే దెబ్బా దెబ్బాగానే ఉన్నప్పటికి ప్రస్తుత ఐపీఎల్ 2024 సీజన్ లో రెండు జట్లు కూడా నువ్వా నేనా? అన్నట్టే ఓడిపోతున్నాయి.

ముంబై ఇండియన్స్ గత మ్యాచ్ లో ముగ్గురు గోల్డెన్ డక్ అవుట్లు అయ్యారు. వారేమైనా పుంజుకుంటే మ్యాచ్ రసకందాయంలో పడుతుందని అంటున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పుడే విజయాల బాట పట్టింది. మరి దానిని కొనసాగిస్తుందా? లేదా అనే ది చూడాలి.

ముంబై హ్యాట్రిక్ ఓటములతో ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఆడిన 4 మ్యాచ్ ల్లో మూడు ఓడిపోయింది, ఒకటి గెలిచింది. అందువల్ల రెండు జట్ల బలాబలాలు ఒకేలా ఉన్నాయని, దొందూ దొందే అంటున్నారు. కాకపోతే ముంబై ఇండియన్స్ కసిగా ఉంది. ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. మరి వీరి తాకిడిని ఢిల్లీ క్యాపిటల్స్ ఎలా ఎదుర్కుంటుందో చూడాల్సిందే.

Also Read: Romario Shepherd: ముంబైని గెలిపించిన వీరుడు.. రొమారియో షెఫర్డ్

ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా)
ముంబై: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, గెరాల్డ్ కొయెట్జీ, పీయుష్ చావ్లా, ఆకాశ్ మధ్వాల్, జస్ప్రీత్ బుమ్రా, క్వెనా మఫాకా.

ఢిల్లీ: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్ & వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, రసిఖ్ దార్ సలామ్, అన్రిచ్ నోకియా, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×