BigTV English

CSK Fan Gets Shocking Experience: హేయ్ ప్రభూ.. ‘నా సీటు పోయింది.. మీకు ఏమైనా కనిపించిందా’..

CSK Fan Gets Shocking Experience: హేయ్ ప్రభూ.. ‘నా సీటు పోయింది.. మీకు ఏమైనా కనిపించిందా’..


CSK Fan Gets Shocking Experience: ఉప్పల్ స్టేడియంలో నిన్న జరిగిన సీఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ మ్యాచ్‌తో హైదరాబాద్ దద్దరిల్లిపోయింది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు సినీ సెలబ్రిటీలు, రాజకీయనాయకులు సహా అభిమానులు స్టేడియం వద్ద పెద్ద ఎత్తున తరలి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉప్పల్ స్టేడియంలో విచిత్ర ఘటన వెలుగుచూసింది. ఓ సీఎస్కే అభిమాని తన సీటు పోయిందంటూ వెతుకులాడిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రూ. 4,500 పెట్టి టికెట్ కొని తీరా స్టేడియంకు వెళ్లి చూసేసరికి తన సీటు లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశాడు. అసలు సీటు పోవడం ఏంటి. మళ్లీ దొరికిందా లేదా ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సీఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య జరిగిన పోరును వీక్షించేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. అయితే స్టేడియంలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే సీట్లకు రూ. 4500గా ధరలను కేటాయిస్తారు. ఎందుకంటే ఇక్కడ కూర్చుని చూస్తే ఆటగాళ్లు చాలా దగ్గర కనిపిస్తారు. తమ అభిమాన క్రికెటర్‌ను చూసేందుకు కూడా ప్రేక్షకులు వేలు పోసి మరి టికెట్ కొంటుంటారు. అయిలే అలాగే తన అభిమాన ఆటగాళ్లలో ఒకడైన జునైద్ అహ్మద్ అనే వ్యక్తి ధోనీని చూసేందుకు రూ.4500 పోసి మరి టికెట్ కొన్నాడు. తీరా మ్యాచ్ స్టార్ట్ అయ్యాక స్టేడియంకు వెళ్లి వెతికితే అతడి సీటు కనిపించకుండా పోయింది. ఇక ఏముంది ధీనంగా ఏమి చేయలేని పరిస్థితిలో అక్కడే నిలుచుని క్రికెట్ మ్యాచ్ చూస్తుండిపోయాడు.


అహ్మద్‌కు జే-66 పేరుతో సీట్ నెంబర్ కేటాయించారు. ఈ క్రమంలో సాయంత్రం 5 గంటలకు స్టేడియంకు చేరుకోగా లోపలికి వెళ్లి చూస్టే సీటు కనిపించకుండా పోయింది. అయితే జే 65, జే 67 సీట్ నంబర్లు ఉన్నాయి.. కానీ జే 66 నంబర్ సీట్ మాత్రం అక్కడ మిస్ అయింది. తన నెంబర్ తో అక్కడ స్టిక్కర్ లేకపోవడంతో అభిమాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో నెటిజన్లు స్పందిస్తూ హెచ్సీఏకు ఫిర్యాదు చేయాలంటూ సలహాలు ఇస్తున్నారు.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×