Big Stories

IPL 2024 MI Vs SRH Highlights: ఓడిన వారి మధ్య ఫైట్.. నేడు హైదరాబాద్ – ముంబై మధ్య పోరు!

MI vs SRH IPL 2024

- Advertisement -
- Advertisement -

రెండు జట్లకి కెప్టెన్లు కొత్తవారే. ముంబై జట్టు హార్దిక్ పాండ్యాకు ఎవరికి తెలీని గట్టి ప్యాకేజి ఇచ్చి తెచ్చుకుంది. అలాగే హైదరాబాద్ కు రూ. 20.5 కోట్లతో ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ ను తెచ్చుకుంది. అందువల్ల ఇద్దరూ కాస్ట్ లీ కెప్టెన్లే కావడంతో ప్రతి మ్యాచ్ కూడా కాస్ట్ లీగానే మారిపోతోంది.

ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టులో హార్దిక్ పాండ్యా తీవ్రంగా ట్రోలింగ్ బారిన పడుతున్నాడు. తన ఆటతీరుపై ఫోకస్ పెట్టలేకపోతున్నాడు. అనవసరంగా వచ్చి ఇరుక్కుపోయాన్రా…అని తెగ బాధపడిపోతున్నాడు. చక్కగా గుజరాత్ కెప్టెన్ గా ఉంటూ ఎంజాయ్ చేసేవాడిని, ఇలాగైందేమిటి? అని నెత్తి కొట్టుకుంటున్నాడు.

అటువైపు కమిన్స్ పరిస్థితి కూడా అలాగే ఉంది. తనొక్కడిని మార్చితే ఎలాగ? క్రికెట్ లో 11 మంది కరెక్టుగా ఆడితేనే మ్యాచ్ గెలుస్తామని తను ఫీలవుతున్నాడు. అయితే కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో మాత్రం చివరి బాల్ వరకు పోరాడి ఓడింది. ముంబై జట్టు పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్ష్యం చిన్నదైన చివరి ఓవర్ వరకు తెచ్చుకుని ఓటమి పాలైంది.

Also Read: వారెవ్వా.. ధోనీ స్టన్నింగ్ క్యాచ్‌..!

హైదరాబాద్ లో సొంతగడ్డపై సన్ రైజర్స్ కు ఇదే మొదటి మ్యాచ్. భువనేశ్వర్, మార్కో యాన్సన్, నటరాజన్, కమిన్స్ లతో సన్ రైజర్స్ బలమైన బౌలింగ్ కలిగి ఉంది. మిడిల్ ఆర్డర్ లో క్లాసెన్, షాబాజ్ లాంటి వారున్నారు. టాప్ ఆర్డర్ లో మయాంక్ అగర్వాల్, అభిషేక్ వర్మ, రాహుల్ త్రిపాఠి, మార్ క్రమ్ కరెక్టుగా ఆడితే హైదరాబాద్ కు తిరుగుండదని అంటున్నారు.

ముంబైకి వచ్చేసరికి రోహిత్ శర్మ, బ్రెవిస్ బాగా ఆడారు. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా, నమన్ థీర్ లాంటివాళ్లు కరెక్టుగా ఆడితే ఇంక వారికి తిరుగుండదు. ఇప్పుడీ రెండు జట్లకు జీవన్మరణ సమస్యగా మారింది. గెలవక తప్పని పరిస్థితి ఎదురైంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News