BigTV English

Hardik and Krunal Pandya: పాండ్యా బ్రదర్స్ మోసపోయారు..!

Hardik and Krunal Pandya: పాండ్యా బ్రదర్స్ మోసపోయారు..!
Hardik Pandya’s Stepbrother Arrested: క్రికెట్ లో ఆడటం, ఓడిపోవడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఎల్లవేళలా గెలుస్తూ ఆడలేం, అలాగని ఓడిపోతూ ఉండలేం. కానీ ఇదే ఫార్ములాని బయట బిజినెస్ లో అప్లై చేస్తే తీవ్రంగా నష్టపోతాం. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా సోదరులు ఇద్దరూ కలిసి, వరసకు సోదరుడైన వైభవ్ పాండ్యాతో కలిసి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారు. తీరా సొదరుడు మోసం చేశాడని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు రంగప్రవేశం చేసి సోదరుడిని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు.

వివరాల్లోకి వెళితే హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా.. ఇద్దరూ క్రికెట్ ఆడతారనే సంగతి తెలిసిందే. కృనాల్ బరోడా జట్టులో ఆడుతున్నాడు. ఐపీఎల్ లో లక్నో జట్టు తరఫున ఆడుతున్నాడు. వీరిద్దరూ కలిసి వరసకి సోదరుడైన వైభవ్ పాండ్యాతో కలిసి పాలిమర్ ప్లాస్టిక్ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇందులో బ్రదర్స్ ఇద్దరూ 40 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టారు. అంటే ఇద్దరూ 80శాతం పెట్టారు. వైభవ్ పాండ్యా ఏం చేశాడంటే తను 20 శాతం పెట్టాడు.


వ్యాపార నిర్వహణంతా వైభవ్ చూసుకునేలా బాధ్యతలను అప్పగించారు. కొన్ని నెలలు బాగానే ఉంది. వచ్చిన లాభాలను ఇదే నిష్పత్తి లో పంచుకున్నారు. అయితే పాండ్యా సోదరులకు తెలియకుండా కొద్దిరోజుల క్రితం వైభవ్ సొంతంగా మరో పాలిమర్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఇదే సమయంలో బిజినెస్ లో లాభాలను 20 శాతం నుంచి 33 శాతానికి పెంచుకున్నాడు. అలాగే సంస్థ అకౌంట్ నుంచి
డబ్బులను భారీ మొత్తంలో తన ఖాతాకు మళ్లించుకున్నాడు.

Also Read: చెమటోడ్చిన పీవీ సింధు, ప్రణయ్

అలా మొత్తంగా సుమారు రూ.4.3 కోట్లకు పాండ్యా బ్రదర్స్ కి టోపీ పెట్టాడు. విషయం గురించి బ్రదర్స్ ఇద్దరూ వైభవ్ ని గట్టిగా నిలదీశారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే పరువు తీస్తానంటూ వైభవ్ బెదిరించినట్టు సమాచారం. దీంతో హార్దిక్, కృనాల్ ఇద్దరూ ముంబాయి పోలీసులను ఆశ్రయించారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైభవ్ ను అరెస్ట్ చేశారు. దీనిపై తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

ముంబై జట్టులో తలనొప్పులకు తోడు, ఇవి కూడా తోడవడంతో హార్దిక్ పాండ్యా తలపట్టుకున్నాడని అంటున్నారు.


Related News

Rinku Singh: పాపం రింకూ… తన బ్యాట్ కు రాఖీ కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడుగా

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Big Stories

×