Back Pain: రోజంతా కంప్యూటర్ ముందు కూర్చొని పని చేయడం వల్ల చాలా మందికి వెన్ను నొప్పి వస్తుంది. దీని వల్ల పని మీద ద్యాస కూడా ఉండకుండా పోతుంది. మరికొందరిలో అధిక బరువులు ఎత్తడం వల్ల, తీసుకునే ఆహారం, నిద్రలేమి, ఒత్తిడి వంటి వాటి వల్ల కూడా వెన్ను నొప్పి ఎక్కువగా వస్తుంది. దీన్ని తగ్గించుకోవడానికి పెయిన్ కిల్లర్స్ వాడినా చాలా సార్లు ఎలాంటి ఫలితం ఉండదు. పైగా తరచుగా పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే కీళ్ల నొప్పలు, వెన్ను నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు వస్తే సహజంగానే వాటిని వదిలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల వెన్ను నొప్పి సమస్య నుంచి బయట పడే అవకాశం ఉందని అంటున్నారు.
తగ్గించడమెలా..?
వయసు పెరుగుతున్న కొద్దీ చాలా మందికి వెన్ను నొప్పి సమస్యలు రావడం సహజమే. అయితే కొన్ని టిప్స్ పాటించడం వల్ల దీని నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వెన్ను నొప్పిని తగ్గించడానికి వాకింగ్, స్విమ్మింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామాలు సహాయపడతాయని అంటున్నారు.
అధిక బరువులు ఎత్తడం వల్ల చాలా మందికి వెన్ను నొప్పి వస్తుందట. ఇప్పటికే వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతున్న వారు బరువులు ఎత్తకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
స్మోకింగ్ చేయడం వల్ల డిస్క్ సమస్యలు వస్తాయట. దీని నుంచి తప్పించుకోవాలంటే సిగరెట్లు తాగడం మానేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
ALSO READ: ఏది ముట్టుకున్నా షాక్ కొడుతుందా..?
కాల్షియం లోపించడం వల్ల చాలా మందిలో వెన్ను నొప్పి వస్తుందట. అందుకే కాల్షియం అధికంగా ఉండే పాల ఉత్పత్తులు, కోడి గుడ్లు, పాలకూర, అరటి పండ్ల వంటి వాటిని ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినప్పుడు కూడా ఈ సమస్య వచ్చే ఛాన్స్ ఉందట. ఎముకల జాయింట్ల మధ్యలో యూరిక్ యాసిడ్ స్ఫటికాలు చెరినప్పుడు వెన్ను నొప్పి వస్తుంది. దీని నుంచి తప్పించుకోవాలంటే యూరిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.