BigTV English

Musheer Khan: ఐపీఎల్ లో కొనుగోలు చేయకపోయినా బాధ లేదు: ముషీర్ ఖాన్

Musheer Khan: ఐపీఎల్ లో కొనుగోలు చేయకపోయినా బాధ లేదు: ముషీర్ ఖాన్

Musheer Khan ipl newsMusheer Khan IPL News(Indian cricket news today): అండర్-19 వరల్డ్ కప్ లో దుమ్ము దులిపాడు. ముంబై రంజీ లో అదరగొట్టాడు. ఫైనల్లో సెంచరీతో ట్రోఫీని అందించాడు. అతనెవరో కాదు డైనమిక్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు స్టార్ బ్యాటర్ ముషీర్ ఖాన్.
ఇక్కడ విచిత్రం ఏమిటంటే తను ఐపీఎల్ లో ఆడటం లేదు. ముఖ్యంగా ఎవరూ తనని కొనుగోలు చేయలేదు.


ఈ విషయంపై ముషీర్ ఖాన్ మాట్లాడుతూ.. మానాన్న ఎప్పుడూ ఒక మాట అనేవారు. ఐపీఎల్ లో ఎప్పుడైనా అవకాశం వస్తుంది. కానీ జాతీయ జట్టులో రావడమే కష్టం. అందుకే దీనిపైనే ఫోకస్ పెట్టమని చెప్పారు. అందులో చోటు దొరికితే ఆటోమేటిక్ గా ఐపీఎల్ తలుపులు అవే తెరుచుకుంటాయని అన్నాడు.

మానాన్న ఎప్పుడూ దేశం కోసమే ఆడమని అనేవారు.. అందులోనే ఆత్మ సంతృప్తి ఉంటుందని చెబుతుంటారు. అదీ నీజమేనని అన్నాడు. ఐపీఎల్ లో కొనుగోలు చేయకపోయినా బాధ లేదు.. నా ముందున్న లక్ష్యం జాతీయ జట్టులో చోటు సంపాదించడమేనని అన్నాడు.


అయితే నెట్టింట కూడా ఇంత అద్భుతంగా ఆడినా సరే, ముషీర్ ఖాన్ ని ఒక్క ఫ్రాంచైజీ కూడా ఎందుకు కొనుగోలు చేయలేదని ఆశ్చర్యపోతున్నారు. 2025లో ఐపీఎల్ భారీ వేలం ఉంది. అందులో తప్పనిసరిగా ముషీర్ ఖాన్ కి మంచి రేటు పలుకుతుందని నెటిజన్లు వ్యాక్యానిస్తున్నారు. ముషీర్ అన్న సర్ఫరాజ్ మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ సందర్భంగా ముషీర్ ఖాన్ మాట్లాడుతూ ఐపీఎల్ లో ఆడనందుకు బాధ లేదని అన్నాడు. తప్పకుండా ఏదొక రోజు అక్కడ కూడా ఆడతాను. దేనికైనా టైమ్ రావాలని అన్నాడు. ఇప్పుడు వన్డే, టెస్టులు ఆడుతున్నాను. ఈ సమయంలో అవకాశం రాకపోవడం మంచిదే.. నేనింకా ఐపీఎల్ ని అర్థం చేసుకుంటానని తెలిపాడు.

మా అన్నలా స్ట్రోక్స్ ప్లే ఆడేందుకు ట్రై చేస్తానని అన్నాడు. తనే నాకు స్ఫూర్తి అని తెలిపాడు. అతను ఆడే విధానం, క్రికెట్ పై ఉన్న నిబద్ధత చాలా గొప్పగా ఉంటాయని తెలిపాడు. ఇంకా అన్నయ్య సర్ఫరాజ్ చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నాడు. క్రీజులోకి వెళ్లింతర్వాత వద్దన్నా ఒత్తిడికి గురవుతుంటాం. అలా చేస్తే బాల్ అంచనా తప్పుతుందని అన్నాడు. బ్యాటింగులో ప్రాథమిక సూత్రాల ఆధారంగానే బ్యాటింగ్ చేయాలని చెబుతూ ఉంటాడని తెలిపాడు.రంజీ ఫైనల్ లో సెంచరీ చేయడం నాకెప్పటికీ గుర్తుండిపోతుందని అన్నాడు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×