BigTV English

MLC Kavitha ED Custody : వారం రోజులు ఈడీ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత.. సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశం..

MLC Kavitha ED Custody : వారం రోజులు ఈడీ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత.. సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశం..

MLC Kavita ED Custody


MLC Kavitha ED Custody : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ.. రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టింది. ఆమెను కస్టడీకి ఇవ్వాలని ఈడీ తరఫున ఎన్ కే మట్టా, జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. కవిత తరఫున సీనియర్ లాయర్ విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు.

సుదీర్ఘంగా వాదనలు సాగిన తర్వాత కవితను ఈడీ కస్టడీకి న్యాయమూర్తి అనుమతించారు. వారం రోజులు అంటే మార్చి 23 వరకు ఈడీ కస్టడీలోకి తీసుకోవచ్చని ఆదేశాలు ఇచ్చారు. మార్చి 23న తిరిగి న్యాయస్థానంలో కవితను ప్రవేశ పెట్టాలని స్పష్టంచేశారు.


శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కవిత నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. దాదాపు నాలుగున్నర గంటల సేపు తనిఖీలు చేశారు. ఆ తర్వాత కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. శనివారం ఉదయం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు.

Also Read : ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్ ఇదే..? 

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు న్యాయస్థానం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. రోజూ ఫ్యామిలీ మెంబర్స్ ను కలుసుకునే అవకాశం ఇచ్చింది. అలాగే న్యాయవాదులతో సంప్రదింపులు చేసుకునే వీలు కల్పించింది. ఇంటి నుంచి ఫుడ్ తెప్పించుకునేందుకు అనుమతి ఇచ్చింది.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×