E-Paper
Advertisement

Kamareddy: కామారెడ్డిలో రాజకీయ సెగ.. పతాక స్థాయికి చేరిన కాంగ్రెస్- బీజేపీ పోరు

Kamareddy: కామారెడ్డిలో రాజకీయ సెగ.. పతాక స్థాయికి చేరిన కాంగ్రెస్- బీజేపీ పోరు
Advertisement

Kamareddy: కామారెడ్డి పట్టణంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య సాగుతున్న సవాళ్లు, ప్రతిసవాళ్లు చివరకు ఘర్షణలకు దారితీశాయి. నిన్న ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి నివాసం వద్ద చోటుచేసుకున్న కారు ధ్వంసం, దహనం ఘటనలతో పట్టణంలో హైటెన్షన్ కొనసాగుతోంది. శాంతిభద్రతలను పరిరక్షించేందుకు పోలీసులు భారీగా మోహరించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రాక
ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు నేడు మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డికి చేరుకోనున్నారు. ఆయన నేరుగా ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి క్యాంపు కార్యాలయానికి వెళ్లి, నిన్నటి దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం ఈ ఘటనలపై బీజేపీ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తూ ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.

Advertisement

అరెస్టులు, రిమాండ్
నిన్నటి హింసాత్మక ఘటనలపై పోలీసులు సీరియస్ యాక్షన్ ప్రారంభించారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద కారుతో వచ్చి గొడవకు దిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గీ రెడ్డి మహేందర్ రెడ్డితో పాటు మరో ఇద్దరు బీజేపీ కార్యకర్తలను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

పోలీసుల గృహ నిర్బంధాలు
మరోవైపు, బీజేపీ రాష్ట్ర నాయకులు కామారెడ్డికి రాకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పలువురు కీలక నాయకులను వారి నివాసాల్లోనే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు చెబుతుండగా, ప్రభుత్వం కావాలనే తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

రేపు కలెక్టరేట్ వద్ద సవాల్
సవాళ్ల పర్వం ఇంకా సద్దుమణగలేదు. రేపు (సోమవారం) కలెక్టరేట్ వేదికగా అధికారుల సమక్షంలోనే అన్ని విషయాలను తేల్చుకుందామని ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి మరోసారి సవాల్ విసిరారు. అయితే, ఎమ్మెల్యే అసలు విషయాలను పక్కదారి పట్టించేందుకే ఇలాంటి ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు.

Also Read: డైలమాలో గులాబీ క్యాడర్.. పార్టీలో కొనసాగాలా? వద్దా అన్నట్టు రహస్య చర్చలు

ముగియని వివాదం
ప్రస్తుతానికి కామారెడ్డిలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నట్లుగా పరిస్థితి ఉంది. కాంగ్రెస్ నేతల దాడిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుండగా, వివాదానికి మూలం బీజేపీనే అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. పోలీసులు పట్టణమంతా నిఘా ఉంచారు. నేడు రామచంద్ర రావు పర్యటన తర్వాత ఈ ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×