BigTV English

Team India: ఓడారు సరే.. ఇక భవిష్యత్తేంటి?

Team India: ఓడారు సరే.. ఇక భవిష్యత్తేంటి?

2021 T20 వరల్డ్ కప్ లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన టీమిండియా… తాజా T20 వరల్డ్ కప్ లో సెమీస్ దాకా రాగలిగింది. ఈ రెండు వరల్డ్ కప్ ల మధ్యలో 35 అంతర్జాతీయ T20 మ్యాచ్ లు ఆడిన టీమిండియా… ఏకంగా 26 గెలిచింది. కానీ… అసలు సిసలైన టోర్నీలో మాత్రం బోల్తా కొట్టింది. దాంతో… వచ్చే ఏడాది, ఆపై ఏడాది జరిగే వన్డే, T20 వరల్డ్ కప్ లకైనా మాంఛి జట్లను సిద్ధం చేస్తారా? లేక ఎప్పట్లాగే సీనియర్లకే ప్రయారిటీ ఇచ్చి కొంప ముంచుతారా? అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.


2024 T20 వరల్డ్ కప్ కు జట్టులో రోహిత్ శర్మ, కోహ్లీ… ఇద్దరికీ స్థానం దక్కడం అనుమానమే. ఎందుకంటే… అప్పటికి రోహిత్‌కు 37, కోహ్లికి 36 ఏళ్లు వచ్చేస్తాయి. రోహిత్‌ ఇప్పటికే మైదానంలో చాలా దారుణంగా కదులుతున్నాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కోహ్లీకి ఫిట్‌నెస్‌ సమస్య లేకపోయినా… T20ల్లో ఇప్పటికే చాలా సాధించేశాడు కాబట్టి… కొత్త వాళ్లకి ఛాన్స్ ఇస్తే బాగుంటుందనేది ఫ్యాన్స్ అభిప్రాయం. ఇక భారత్ ఆడబోయే రెండు సిరీస్ లకూ అశ్విన్, దినేష్ కార్తీక్ లను ఎంపిక చేయకపోవడంతో… వాళ్లిద్దరి T20 కెరీర్ ముగిసినట్టే. ఇక కె.ఎల్.రాహుల్ కూడా T20ల్లో గొప్పగా ఆడటం లేదు కాబట్టి పక్కన పెట్టడమే ఉత్తమం అనే అభిప్రాయం వినిపిస్తోంది. అటు షమీ, భువీ పరిస్థితి కూడా దాదాపుగా ఇలాగే ఉంది. ఆసియాకప్, T20 వరల్డ్ కప్ లో నిరాశపరిచిన భువీతో పాటు… షమీ T20 కెరీర్‌ కూడా ఇక ముందుకు వెళ్లే అవకాశం కనిపించడం లేదు.

వచ్చే మెగాటోర్నీలకు BCCI ఇప్పటి నుంచే కుర్రాళ్లను సిద్ధం చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. దూకుడుగా ఆడే పృథ్వీ షా, సంజు శాంసన్, శుబ్‌మన్‌ గిల్‌, పంత్‌లను మరింత రాటుదేల్చితే… జట్టు బలంగా తయారవడం ఖాయమంటున్నారు.. ఫ్యాన్స్. ఇక బౌలర్ల విషయానికొస్తే స్పిన్‌ వేయడంతో పాటు బ్యాటింగ్ కూడా చేయగల సామర్థ్యం వాషింగ్టన్‌ సుందర్‌కు ఉందని… పేస్‌ విభాగంలో ఉమ్రాన్‌ మొదలు మొహసిన్‌ వరకు ఎన్నో ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయని సూచిస్తున్నారు. ప్రత్యర్థుల్ని భయపెట్టే సూర్యకుమార్ యాదవ్, బుమ్రా జట్టులో చేరితే… భారత T20 జట్టుకు తిరుగుండదంటున్నారు. ఇప్పటికే T20 మ్యాచ్ ల్లో రాణిస్తున్న హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పజెప్పి… జట్టును మొత్తం సమర్థులైన కుర్రాళ్లతో నింపేస్తే… 2024 T20 వరల్డ్ కప్ అయినా నెగ్గే ఛాన్స్ ఉంటుందంటున్నారు. మార్పులు, చేర్పులు జరక్కపోతే… మెగా టోర్నీల్లో టీమిండియాకు మరోసారి పరాభవం తప్పదంటున్నారు. మరి ఫ్యాన్స్ అభిప్రాయాల్ని బీసీసీఐ ఏ మేరకు పరిగణనలోకి తీసుకుంటుందో చూడాలి.


Tags

Related News

Heavy Rains: తెలంగాణకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌లో భారీవర్షాలతో మునిగిపోయే జోన్స్ ఇవే

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Big Stories

×