Vilar News : పోలీసులకు ఓ అత్యవసర కాల్ వచ్చింది.. అవతలి వ్యక్తి తనను తుపాకీతో కాల్చారు అని చెప్పారు. అంతే.. పరుగులంకించుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.. అప్పటి వరకు అక్కడే ఉన్న బాధితుడు, నిందుతులను చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఎందుకంటారా.. ఎందుకంటే, ఆ వ్యక్తిని కాల్చింది ఏడాది వయస్సున్న కుక్క. అవును మీరు చదువుతుంది కరెక్టే.. ఏడాది వయస్సున్న కుక్క కాల్చడంతో ఓ వ్యక్తికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఇంతకీ ఏ సందర్భంలో కుక్క కాల్చిందో తెలుసా.. బాధిత వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ తో… బెడ్ పై ఉన్నప్పుడు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
అమెరికాలోని మెంఫిస్ పోలీస్ డిపార్ట్‌మెంట్ పోలీసులకు కాల్పులకు సంబంధించిన ఫోన్ కాల్ వచ్చింది. తనను తన కుక్క కాల్చిందని చెప్పాడు. అయితే.. సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని, కుక్క ఒరియోను కనుక్కున్నారు. కానీ.. వారికి సంఘటన స్థలంలో ఎటువంటి ఆయుధం కనిపించలేదు. అదేమని అడిగితే.. తన గర్ల్ ఫ్రెండ్ ఆ తుపాకీని తీసుకువెళ్లిందని బాధితుడు పోలీసులకు చెప్పాడు.
కుక్క మనిషిని ఎలా కాల్చింది?
ఈ అనుమానమే అందరికీ వస్తుంది. అయితే.. బాధితుడు పోలీసులకు చెప్పిన దాని ప్రకారం.. ఓరియా అనే కుక్క పంజా.. ట్రిగ్గర్ గార్డులో ఇరుక్కుపోయిందంట. ట్రిగ్గర్ గార్డు నుంచి విడిపించుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో.. ట్రిగ్గర్ ను నొక్కింది. దాంతో.. తుపాకీ పేలి.. తుటా దూసుకు వచ్చింది. మంచం మీద పడుకుని ఉన్న బాధితుడి తొడలోకి ఆ బుల్లెట్ దూసుకుపోయింది. పోలీసులు వచ్చిన తర్వాత.. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే.. దాని వల్ల అతనికి ఎలాంటి గాయాలు కాలేదని వైద్యులు తేల్చారు. గాయం చిన్నదేనని.. త్వరగానే తగ్గిపోతుందని చెప్పారంట. కానీ.. అతని ప్లానింగ్స్ మొత్తాన్ని.. ఆ కుక్క భలే చెడగొట్టింది కదూ.. అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
విచిత్రమైన ప్రమాదం
ఈ విషయంపై బాధితుడి గర్ల్ ఫ్రెండ్ కూడా రియాక్ట్ అయ్యిందండోయ్. అతి ఒక వింతైన ప్రమాదం అంటూ తెలిపింది. ఎదురుగా పెట్టి ఉన్న తుపాకీ పైకి కుక్క దూకింది. ఒక్కసారిగా తుపాకీ పేల్చింది.. అని ఆ బాధితుడి గర్ల్ ఫ్రెండ్ తెలిపింది. ఆ ఘటన తర్వాత.. గాయం నుంచి బాధిత వ్యక్తి కోలుకుంటున్నాడని, ఆ వ్యక్తిని కాల్చి చంపిన పిట్‌బుల్ బాగానే ఉందని తెలిపింది. అయితే.. ఆ కుక్క చాలా సరదాగా ఉండే కుక్క, దానికి ఎగరడం, దూకడం అలాంటివి చేయడం ఇష్టమని.. అలా చేస్తుంటేనే.. అనుకోకుండా తుపాకీ పేలిపోయిందంటూ ఆ యువతి స్పందించింది. తన నిద్రను చెడగొట్టింది.. కుక్కనా, తుపాకీ తూటానా అని అడిగితే.. తూటానే తన నిద్రను చెడగొట్టింది అంటూ చెప్పుకొచ్చింది.
Also Read : Viral News : కోహ్లీ ఔటయ్యాడని 14 ఏళ్ల బాలిక చనిపోయింది
కొన్ని సంవత్సరాలుగా ప్రమాదవశాత్తు కాల్పుల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గత సంవత్సరం, తెలంగాణకు చెందిన 23 ఏళ్ల ఆర్యన్ రెడ్డి తన పుట్టినరోజు వేడుకలో ప్రమాదవశాత్తు తనను తాను కాల్చుకుని మరణించాడు. కాన్సాస్ స్టేట్ యూనివర్శిటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ చదువుతున్న ఆర్యన్ రెడ్డి.. పార్టీ సమయంలో తన తుపాకీని శుభ్రం చేస్తుండగా కొత్తగా కొనుగోలు చేసిన ఆయుధం డిస్చార్జ్ అయ్యింది. తుపాకీ పేలిన శబ్దం విన్న అతని స్నేహితులు అతని గదికి పరుగెత్తారు. రక్తపు మడుగులో అతను కనిపించాడు, అప్పటికే.. అతను అక్కడ ప్రాణాలు కోల్పోయాడు.