Jio Hotstar – IPL 2025: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ 18వ ఎడిషన్ మార్చ్ 22 నుండి ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని జట్లు తమ సన్నాహాలను ప్రారంభించాయి. ఆదివారం రోజు రాత్రి వరకు ఐసిసి ఛాంపియన్ ట్రోఫీ 2025 మజాను ఆస్వాదించిన క్రికెట్ ప్రియులు.. ఇప్పుడు ఐపీఎల్ కొత్త సీజన్ పై దృష్టి పెట్టారు.
Also Read: KL Rahul: ఏం గుండె రా అది… ఐపీఎల్ 2025 కంటే ముందు కేఎల్ రాహుల్ సంచలన నిర్ణయం ?
అయితే ఐపీఎల్ లో మ్యాచ్ లు చూడడానికి మీరు జియో డేటా రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నారా..? ఆ డేటా మీకు సరిపోవడం లేదా..? ఇందుకోసం కస్టమర్లకు ప్రత్యేక డేటా ప్లాన్ ని ప్రవేశపెట్టింది {Jio Hotstar – IPL 2025} జియో. ఈనెల 22 నుండి ప్రారంభం కాబోయే ఐపీఎల్ సీజన్ కోసం రిలయన్స్ జియో అద్భుతమైన ఆఫర్ ని తీసుకువచ్చింది. ఎందుకంటే ఐపీఎల్ 2025 సీజన్ జియో హాట్ స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం కాబోతోంది.
దీంతో క్రీడాభిమానుల కోసం జియో రూ ₹100 ప్లాన్ ని తీసుకువచ్చింది. ఈ వంద రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే మూడు నెలల పాటు జియో హాట్ స్టార్ ని ఉచితంగా పొందవచ్చు. ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో 5జిబి డేటా తో పాటు జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. అయితే {Jio Hotstar – IPL 2025} ఈ ప్లాన్ ద్వారా కాల్స్, ఎస్ఎంఎస్ వంటి సౌకర్యాలను పొందలేరు. రోజు 5 జిబి డేటా పూర్తయ్యాక ఇంటర్నెట్ స్పీడ్ 64 కేబిపిఎస్ కి పరిమితం అవుతుంది.
అయితే జియో హాట్ స్టార్ సుబ్క్రిప్షన్ ప్లాన్ నెల రోజులకు గాను 149 గా ఉంది. ఇక ప్రీమియం ప్లాన్ కావాలనుకునే వారు నెలకు 299 చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి 1,499 చెల్లించాలి. జియో సినిమా మరియు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విలీనం తర్వాత రిలయన్స్ జియో తన అన్ని రీచార్జ్ ప్లాన్ల నుండి బేసిక్ జియో సినిమా బెనిఫిట్ ని తొలగించింది. ఈ నేపథ్యంలో మార్చి 22 నుండి ప్రారంభమయ్యే ఐపీఎల్ 18వ సీజన్ ఫీవర్ ని మీరు మిస్ కాకూడదనుకుంటే {Jio Hotstar – IPL 2025} జియో హాట్ స్టార్ సుబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే.
Also Read: Jagan Mohan on SRH: SRH లో భయంకరమైన బ్యాటర్లు.. 300 స్కోర్ ఈ సారి పక్కా?
ఇక ఈ వంద రూపాయల ప్లాన్ ఐపీఎల్ అభిమానులకు బెస్ట్ ఆప్షన్ అవుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వంద రూపాయల ప్లాన్ లో వినియోగదారులు స్మార్ట్ ఫోన్ & స్మార్ట్ టీవీ రెండింటిలోనూ మ్యాచ్ లను చూడవచ్చు. అంతేకాకుండా జియో హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న వెబ్ సిరీస్ లు, సినిమాలను కూడా 1080 p రిజర్వేషన్ లో వీక్షించవచ్చు. ఈ ప్లాన్ పట్ల వినియోగదారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.