Memes on RCB : ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా నిన్న రాత్రి పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ వర్షం కారణంగా కాస్త ఆలస్యంగా ప్రారంభం అయింది. చిన్న స్వామి స్టేడియంలో ఎంత వర్షం వచ్చినప్పటికీ అరగంట సేపట్లో వాటర్ అంతా క్లియర్ చేసే కెపాసిటీ ఉన్న విషయం తెలిసిందే. వర్షం వెలిసిన తరువాత 14 ఓవర్లకు మ్యాచ్ ని కుదించారు. దీంతో తొలుత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 95 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అయితే ఆలౌట్ కూడా రూ.95 కే అని సోషల్ మీడియాలో కొందరూ ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఈ వార్త ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
మరోవైపు ప్రముఖ మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఆర్సీబీ పేలవంగా బ్యాటింగ్ చేసిందని.. అందరూ ఔట్ అవ్వడానికి అజాగ్రతత షాట్లు ఆడారని తెలిపారు. మంచి బంతికి ఒక్క బ్యాటర్ కూడా ఔట్ కాలేదు. కనీసం ఒక్క బ్యాటర్ అయినా కాస్త తెలివి చూపించి ఉండాలి. వారి వద్ద వికెట్లు ఉంటే వారు 14 ఓవర్లలో 110 లేదా 120 పరుగులు సాధించగలిగేవారు. కానీ చెత్త షాట్లతో పొరపాట్లు చేశారు. అలాంటి పొరపాట్ల గురించి కెప్టెన్ రజత్ పాటిదార్ ఆలోచించి పరిష్కారం కనుక్కోవాలని పేర్కొనడం విశేషం. వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 14 ఓవర్లలో 95 పరుగులు చేసింది. దాదాపు 8 మంది ఆర్సీబీ బ్యాటర్లు కూడా రెండంకెల స్కోర్ కూడా చేరుకోలేకపోయారు. ఆర్సీబీ తరుపున కేవలం టిమ్ డేవిడ్ ఒక్కడే 50 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు.
ఆ తరువాత లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ 12.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి మ్యాచ్ ను గెలుచుకుంది. ఆర్సీబీ బ్యాటర్లలో మిడిలార్డర్ లో దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, లియామ్ లివింగ్ స్టోన్, జితేష్ శర్మ మెరుగైన ప్రదర్శన చేయలేదు. గత మ్యాచ్ లో రజత్ పాటిదార్, టిమ్ డేవిడ్ మినహా ఎవ్వరూ అంతగా రాణించలేదు. లివింగ్ స్టోన్ వైఫలం జట్టు విజయావకాశాలను దెబ్బతీస్తోంది. ఫినిషర్ గా టిమ్ డేవిడ్ ఒక్కడే సత్తా చాటుతున్నాడు. ప్రతీ మ్యాచ్ లో మెరుగైన ప్రదర్శన చేశాడు. ఇక బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్, జోష్ హజెల్ వుడ్ తమ ప్రతిభ కనబరుస్తున్నారు. వారికి తోడు యశ్ దయాల్ కూడా పర్వాలేదనిపిస్తున్నాడు. స్పిన్నర్లు కృణాల్ పాండ్యా, సుయాశ్ కీలకంగా వ్యవహరించాలి.
మరోవైపు నిన్న పంజాబ్ తో ఓడిపోయిన ఆర్సీబీ జట్టు రేపు అదే పంజాబ్ తో తలపడనుంది. ఆర్సీబీ సొంత మైదానం చిన్న స్వామి స్టేడియంలో ఓడిపోయిన జట్టు.. పంజాబ్ సొంత మైదానంలోనైనా ప్రతీకారం తీర్చుకుంటుందా..? లేక ఓటమినే రిపీట్ చేస్తుందా..? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆర్సీబీ సాధించిన 95 పరుగులకు ఆలౌట్ ని యాడ్ చేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం గమనార్హం. ఇలా ట్రోలింగ్స్ చేసిన వారికి ఆర్సీబీ సమాధానం చెబుతుందో లేదో వేచి చూడాలి మరీ.
— Gems of Cricket (@GemsOfCrickets) April 18, 2025