IND vs ENG : ప్రస్తుతం టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టెస్ట్ మ్యాచ్ లసిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో తొలి టెస్టు మ్యాచ్ లీడ్స్ లో జరగ్గా.. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత జట్టు బౌలర్లు విఫలం చెందడం.. ఫీల్డర్లు క్యాచ్ లు మిస్ చేయడంతో టీమిండియా(Team India) విజయం సాధిస్తుందునుకున్న మ్యాచ్ లో ఓటమి పాలైంది. ముఖ్యంగా టీమిండియా కీలక బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీశాడు. ఇక ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ లో మాత్రం ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం. దీంతో బుమ్రాని రెండో టెస్ట్ మ్యాచ్ కి తొలగిస్తారని వార్తలు వినిపించాయి.
Also Read : RCB Fan Girl : గ్రౌండ్ లోనే RCB లేడీకి ప్రపోజ్.. వీడియో చూస్తే పిచ్చెక్కి పోవాల్సిందే
బుమ్రా ఔట్ అయినట్టేనా..?
మరోవైపు ఇటీవల టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ (Goutham Gambhir) సైతం జట్టును ఎంపిక చేసిన సమయంలో బుమ్రా(Bumrah) కేవలం మూడు మ్యాచ్ లు మాత్రమే ఆడుతాడు. అవి ఏవి అనేది మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కొత్త కెప్టెన్ శుబ్ మన్ గిల్ కూడా బుమ్రా మూడు మ్యాచ్ లు ఆడుతాడని పేర్కొనడం గమనార్హం. ఇక ఇదిలా ఉంటే.. టీమిండియా (Team India) నుంచి కీలక బౌలర్ బుమ్రా (Bumrah) వెళ్లిపోతుంటే.. మరోవైపు ఇంగ్లాండ్ జట్టుకి కీలక బౌలర్ ఆర్చర్ (Archer) వచ్చేస్తున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ కావడం విశేషం. టీమిండియాతో జులై 02వ తేదీ నుంచి రెండో టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో రెండో టెస్టు కి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తమ స్క్వాడ్ ను ప్రకటించింది. స్టార్ బౌలర్ ఆర్చర్ జట్టులోకి వచ్చారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల మీమ్స్ క్రియేట్ చేసి ట్రోలింగ్ చేయడం విశేషం.
Also Read : MS Dhoni : ధోని స్టోరీ తో మరో సినిమా.. సిద్ధార్థ కొత్త మూవీ ట్రైలర్ అదుర్స్
రెండో టెస్ట్ లో ఇండియా గెలిచేానా..?
ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య జరిగిన తొలి ఇన్నింగ్స్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 471 పరుగులు సాధించడంతో విజయం సాధిస్తుందని అంతా భావించారు. ఇక ఆ తరువాత ఇంగ్లాండ్ జట్టు ఎప్పుడైతే 465 పరుగులు చేసిందో.. ఈ మ్యాచ్ లో భారత్ గెలిచేటట్టు అయితే ఏమి కనిపించడం లేదని అభిమానులు భావించారు. అనుకున్నట్టుగానే ఇంగ్లాండ్ ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్ కనబరిచి ఘన విజయం సాధించడం విశేషం. వాస్తవానికి టీమిండియా బౌలర్లు బౌలింగ్ కట్టు దిట్టంగా చేయకపోవడం.. దొరక్క దొరికిన క్యాచ్ లను ఫీల్డర్లు మిస్ చేయడంతో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. టీమిండియా ఓపెనర్ జైస్వాల్ ఒక్కడే ఏకంగా తొలి టెస్ట్ మ్యాచ్ లో4 క్యాచ్ లు మిస్ చేయడం గమనార్హం. దీనికి తోడు ఇంగ్లాండ్ బ్యాటర్లు అద్బుతంగా బ్యాటింగ్ చేయడంతో టీమిండియా ఇంగ్లాండ్ విజయాన్ని అడ్డుకోలేకపోయింది. ఇక రెండో టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ని ఢీ కొడుతుందా..? లేదా అనేది వేచి చూడాలి మరీ.
ఇంగ్లాండ్ జట్టు :
బెన్ స్టోక్స్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, బషీర్, బెథెల్, బ్రూక్, కార్స్, సామ్ కుక్, డెల్, క్రాలే, ఓవర్టన్, పోప్, రూట్, జెమీ స్మిత్, టంగ్, వోక్స్.
India ready for 2nd test 😢#INDvsENG pic.twitter.com/qnLKASTJ0J
— Rajabets 🇮🇳👑 (@rajabetsindia) June 26, 2025