E-Paper
Advertisement

OTT Movie : అడిగితే డబ్బులు ఇచ్చే దెయ్యం… ఇలాంటి హర్రర్ మూవీని ఎక్కడా చూసి ఉండరు భయ్యా

OTT Movie : అడిగితే డబ్బులు ఇచ్చే దెయ్యం… ఇలాంటి హర్రర్ మూవీని ఎక్కడా చూసి ఉండరు భయ్యా
Advertisement

OTT Movie : ఓటీటీలో జబర్దస్త్ ఫేమ్ అధిరే అభి ప్రధాన పాత్రలో నటించిన ఒక మూవీ రీసెంట్ గా స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇది హారర్ జానర్ లో తెరకెక్కింది. ఒక అతీంద్రీయ శక్తి చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఈ స్టోరీ ఊహించని ట్విస్ట్లు, అదిరిపోయే క్లైమాక్స్ తో ఆకట్టుకుంటోంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..

ఆహా (aha) లో

Advertisement

ఈ తెలుగు హారర్-థ్రిల్లర్ మూవీ పేరు ‘ది డెవిల్స్ చైర్’ (The Devil’s Chair). 2025 లో వచ్చిన ఈ సినిమాకు గంగా సప్తశిఖర దర్శకత్వం వహించారు. ఇందులో అధిరే అభి (విక్రమ్), స్వాతి మండల్ (రుధిర), చత్రపతి శేఖర్, వెంకట్ దుగ్గిరెడ్డి, చంద్ర సుబ్బగారి, అద్విత ప్రధాన పాత్రల్లో నటించారు. 2025 ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైంది. జూన్ నుంచి ఆహా (aha) ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. 1 గంట 42 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDB లో 6.1/10 రేటింగ్ ఉంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

ఈ స్టోరీ విక్రమ్ (అధిరే అభి) అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. అతను జూదంకి అలవాటుపడి, తన కంపెనీ నుండి కోటి రూపాయలను దొంగలిస్తాడు. అయితే ఒక జూదంలో ఆ డబ్బును కూడా కోల్పోతాడు. ఆ తరువాత ఉద్యోగం కోల్పోయి, చట్టపరమైన సమస్యల్లో చిక్కుకుంటాడు. అతని స్నేహితురాలు రుధిర (స్వాతి మండల్), ఒక ఎయిర్ హోస్టెస్ గా జాబ్ చేస్తుంటుంది. అతనికి ఆర్థికంగా, అన్ని విషయాలలో తోడుగా ఉంటుంది. అతన్ని ఒక మంచి ఉద్యోగం కోసం ప్రయత్నించమని ప్రోత్సహిస్తుంది. అయితే ఈ సమయంలో, అతను దొంగలించిన డబ్బును వెంటనే తిరిగి చెల్లించమని కంపెనీ మేనేజ్‌మెంట్ ఒత్తిడి చేస్తుంది. ఇది ఇలా ఉండగా రుధిర ఒక పురాతన ఆంటిక్ కుర్చీని కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్తుంది. ఈ కుర్చీలో ఒక రహస్యమైన దెయ్యం ఉంటుంది. ఇది విక్రమ్‌కు అవసరమైనప్పుడల్లా డబ్బును అందిస్తుంది. విక్రమ్ ఈ డబ్బుతో విలాసవంతమైన జీవనశైలిని ఆనందిస్తాడు. రుధిరను కూడా సంతోషపెడుతూ ఖర్చు చేస్తాడు. కానీ కథ ఇప్పుడు ఊహించని మలుపు తిరుగుతుంది.

ఆ కుర్చీలోని పుండాక్ష అనే దెయ్యం శక్తి ఉంటుంది. అది విక్రమ్‌కు ఐదు కోట్ల రూపాయలను ఆఫర్ చేస్తుంది. కానీ అందుకు అతను తన స్నేహితురాలు రుధిరను చంపాలని కండిషన్ పెడుతుంది. విక్రమ్ ఆర్థిక ఒత్తిడితో కుంగిపోతూ, ఈ దుష్ట శక్తి ఉచ్చులో పడతాడు. అతని జీవితం చీకటిమయం అవుతుంది. అతని మానసిక స్థితి కూడా క్షీణిస్తుంది. ఈ సమయంలో మనోజవ అనే ఒక మెంటలిస్ట్, విక్రమ్‌ను ఈ దెయ్యం నుండి విముక్తి చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆతరువాత స్టోరీలో ఊహించని ట్విస్ట్లులు ఎదరపడతాయి. చివరికి ఈ కుర్చీ గతం ఏమిటి ? పుండాక్ష ఎవరు ? విక్రమ్‌ ఈ దుష్ట శక్తి నుంచి బయటపడతాడా ? ఆ దయ్యం ఎందుకు రుధిరను చంపమంటుంది ? అనే ప్రశ్నల చుట్టూ కథ ఉత్కంఠభరితంగా ముందుకు సాగుతుంది. మీరు కూడా ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : నచ్చిన ఫుడ్ పెట్టలేదని తల్లిదండ్రులకే నరకం చూపించే కుర్రాడు… స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీ

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×