BigTV English

Lalit Modi – Mallya : ఇండియా బ్యాంకులు దోచేసి.. లండన్ లో ఎంజాయ్ చేస్తున్న నీరవ్, మాల్యా

Lalit Modi – Mallya : ఇండియా బ్యాంకులు దోచేసి.. లండన్ లో ఎంజాయ్ చేస్తున్న  నీరవ్, మాల్యా

Lalit Modi – Mallya : ఒకరేమో రూ.9వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోగా.. మరొకరూ మనీలాండరింగ్ సహా పలు ఆర్థిక అవకతవకల ఆరోపణలతో విదేశాలకు వెళ్లిపోయారు. తాజాగా వీరిద్దరూ కలిసి ఒకే పార్టీలో చిందులేశారు. ఇక ఆ ఇద్దరూ మరెవ్వరో కాదు.. విజయ్ మాల్యా, లలిత్ మోడీ. వీరిద్దరినీ ఇండియా కి రప్పించాలని చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ వీళ్లు మాత్రం చాలా సంతోషంగా చిందులేస్తూ కనిపించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా వీరిద్దరూ కలిసి ఓ విలాసవంతమైన పార్టీలో కలిసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Also Read :  Siraj on ENG Players : ముగ్గురిని అరెస్ట్ చేసిన DSP సిరాజ్ 

ఇంటర్నెట్ ను బ్రేక్ చేయదు.. 


సోషల్ మీడియాలో ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ, విజయ్ మాల్యా వీడియో తెగ వైరల్ అవుతోంది. లలిత్ మోడీ ఏర్పాటు చేసిన ఈ పార్టీకి దాదాపు 310 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. ఈ వేడుకలో విజయ్ మాల్యాతో కలిసి లలిత్ మోడీ పాటలు పాడుతూ చిందులు వేశాడు. ఇద్దరూ కలిసి ” ఐ డిడ్ ఇట్ మై వే” అనే పాటను ఆలపించారు. వీరిద్దరూ చిన్నపాటి స్టెప్పుడులు వేస్తుండగా.. వీరి పక్కనున్న పలువురు ప్రముఖులు వీరికి తోడుగా కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను లలిత్ మోడీనే స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేయడం విశేషం. ” ఇంటర్నెట్ ను ఈ వీడియో బ్రేక్ చేయదని ఆశిస్తున్నా.. ఇది వివాదస్పదమే కానీ.. నేను చేసేది అదే ” అని రాసి ఈ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో లపై ఓ వైపు విమర్శలు వెళ్లువెత్తుతుంటే.. మరోవైపు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

భయం లేకుండా ఎంజాయ్.. 

మరోవైపు చివరలో వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ వీరిద్దరీతో కలిసి ఫొటోలు దిగి.. క్రికెట్ బ్యాట్ పై సంతకం చేసి లలిత్ మోడీకి అందించారు. మనీ లాండరింగ్ సహా పలు ఆర్థిక అవకతవకల ఆరోపణలతో లలిత్ మోడీ.. 2010 నుంచి లండన్ లో నే ఉంటున్నారు. అదేవిధంగా కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్యా.. ఇండియాలోని పలు బ్యాంకులకు రూ.9వేల కోట్లకు పైగా రుణాలను ఎగ్గొట్టి లండన్ లో తలదాచుకుంటున్నారు. వీరిద్దరినీ ఇండియా కి రప్పించేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇలాంటి సమయంలోనే వీరిద్దరూ కలిసి ఏ మాత్రం భయం లేకుండా ఎంజాయ్ చేస్తూ కనిపించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ లలిత్ మోడీకి సుప్రీంకోర్టు లో ఎదురుదెబ్బ తగిలింది. విదేశీ మారకద్రవ్యా నిర్వహణ చట్టం నిబంధన ఉల్లంఘన కేసులో ఈడీ తనకు రూ.10.65 కోట్లు జరిమానా విధించడాన్ని ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేసారు. ఈ మొత్తాన్ని బీసీసీఐ చెల్లించేలా ఆదేశించాలని కోరుతూ ఆయన వేసిన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్తానం తోసిపుచ్చింది.

?igsh=MWxheDhjbmJxOWtlYQ==

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×