Manu bhaker latest update(Today’s sports news): పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్‌కి చెందిన షూటర్ మను బాకర్ రెండు కాంస్య పతకాలను సాధించి తిరుగులేని రికార్డులను సాధించింది. అంతేకాదు ఈ విజయాన్ని దేశవ్యాప్తంగా ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఆమె. మంగళవారం సొంతగడ్డ ఇండియాకి రిటర్న్ అయింది. అయితే గతకొన్ని రోజుల పాటు మను రెస్ట్ తీసుకోవాలని డిసైడ్ అయిందట.
ఈ మ్యాటర్‌ని ఆమె కోచ్ జస్పాల్ రాణా తెలిపాడు. అక్టోబర్‌లో భారత్ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ కప్ ఫైనల్‌కి ఆమె దూరమయ్యే ఛాన్స్ ఉందంటూ చెప్పుకొచ్చారు. నేషనల్ మీడియాతో కోచ్ జస్పాల్ రాణా మాట్లాడుతూ… మను మూడు మాసాల పాటు రెస్ట్ తీసుకోనుందట.
Also Read: సిల్వర్ మెడల్ వినేష్ ఫోగట్‌కు ఇవ్వడంపై యూడబ్ల్యూడబ్ల్యూ చీఫ్ క్లారిటీ
అంతేకాదు ఇది చాలా కామన్ రెస్ట్ అని చెబుతున్నారు. ఆమె చాలా డేస్‌గా ట్రైనింగ్ పొందుతోంది. అందుకే షూటింగ్ వరల్డ్ కప్‌లో ఆమె పాల్గొంటుందో లేదో అనే విషయం ఖచ్చితంగా చెప్పలేను అంటూ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే రాబోయే రెండు నెలల్లో 13-18 వరకు దేశ రాజధాని ఢిల్లీలో వరల్డ్‌కప్ జరగనుండగా,, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన గ్రెనెడా వరల్డ్ కప్ ఈవెంట్‌లో మను బాకర్ 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించి భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది.