Shubman Gill – Sara : భారత సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా తొలి సారిగా టీమిండియా ఇంగ్లాండ్ తో 5 టెస్టు సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ లో పర్యటించింది. అయితే తొలి టెస్టులో టీమిండియా ఆటగాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ లేకుండా భారీ స్కోర్ చేసారు. కానీ వారు చేసిన స్కోర్ ని కాపాడుకోవడంలో మాత్రం విఫలం చెందారు. ముఖ్యంగా టీమిండియా తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో అద్భుతంగా ఆడారు. టీమిండియా కీలక బౌలర్ బుమ్రా 5 వికెట్లు తీశాడు. కానీ రెండో ఇన్నింగ్స్ అటు బ్యాటింగ్ లో 364 పరుగులు చేశారు. అయితే 371 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు అలవకగా ఛేదించింది. టీమిండియా బౌలర్లు వికెట్లు తీయడంలో విఫలం చెందడంతో ఇంగ్లాండ్ జట్టు ఘన విజయం సాధించింది.
Also Read : Viral video : ఏంట్రా ఇదేం క్రికెట్.. రన్స్ కోసం లేడీ ప్లేయర్… ఏకంగా బైక్ పైనే
వీరసింహారెడ్డి మూవీ స్టైల్ లో గిల్ కి సారా వంటకాలు
ఇదిలా ఉంటే.. తాజాగా టెస్ట్ కెప్టెన్ శుబ్ మన్ గిల్, సారా టెండూల్కర్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాలో నాటుకోడి, రాగి సంకటి ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆ సినిమాలో హీరో బాలకృష్ణను అసలు ఏం చేయలేకపోయావు.. నీకు తిండి దండుగా అని వరలక్ష్మీ శరత్ కుమార్ తన భర్త పోషించిన దునియా విజయ్ తో పేర్కొంటుంది. ఈ సినిమాలో దునియా విజయ్ ప్రతాప్ రెడ్డి పాత్రలో విలన్ గా నటించారు. ప్రస్తుతం సారా టెండూల్కర్ కూడా శుబ్ మన్ గిల్ కి నీ కోసం రాగి సంకటి, నాటు కోడి, తలకాయ కూర, పొటేల్ కూర తినండి.. సిగ్గుందా నీకు.. అనే డైలాగ్ చెప్పే వీడియోను క్రియేట్ చేశారు. ఈ వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఫస్ట్ టెస్ట్ లో శుబ్ మన్ గిల్ కెప్టెన్సీలో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే.
టీమిండియా విజయం సాధించేనా..?
శుబ్ మన్ గిల్- సారా టెండూల్కర్ గత కొద్ది రోజుల నుంచి ఎఫైర్ ఉందని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు వీరిద్దరూ విడిపోయారని కూడా వార్తలు వినిపించాయి. తాజాగా సారా టెండూల్కర్.. గిల్ కి వివిధ రకాల వంటకాలు పెట్టినట్టు.. వీరసింహారెడ్డి సినిమా డైలాగ్ లతో వీడియోలను ట్రోలింగ్స్ చేయడం విశేషం. తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్లు యశస్వి జైస్వాల్, శుబ్ మన్ గిల్, రిషబ్ పంత్ తొలి ఇన్నింగ్స్ లో సెంచరీలు చేయగా.. రెండో ఇన్నింగ్స్ ఓపెనర్ కే.ఎల్. రాహుల్, రిషబ్ పంత్ సెంచరీలు చేశారు. తొలి టెస్టులో బుమ్రా 5 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్ లో బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం. బుమ్రా రెండో టెస్ట్ మ్యాచ్ కి దూరం కానున్నట్టు తెలుస్తోంది. అలాగే బుమ్రా స్థానంలో అర్ష్ దీప్ సింగ్ బరిలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. జులై 02 నుంచి బర్మింగ్ హోమ్ లో జరిగే మ్యాచ్ లో టీమిండియా విజయం సాధిస్తుందో లేదో వేచి చూడాలి మరీ.
?igsh=MXhzYWtyYnU0bm94dQ==