Sreeleela:యంగ్ బ్యూటీ శ్రీ లీల (Sree Leela) తొలి పరిచయంలో.. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటిరెడ్డి (Kiriti reddy) హీరోగా నటించిన చిత్రం జూనియర్ (Junior) . నిజానికి ఈ సినిమాతో శ్రీ లీలా తొలిసారి ఇండస్ట్రీకి పరిచయం కావాల్సి ఉంది. కానీ హీరో ఆలస్యం వల్ల ఆమె తొలి చిత్రం తెలుగు ‘పెళ్లి సందD’ అయిపోయింది. ఈ గ్యాప్ లో చాలా సినిమాలే చేసేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఈ సినిమా జూలై 18వ తేదీన విడుదలకు నోచుకుంది. ప్రముఖ డైరెక్టర్ రాధాకృష్ణ(Radha Krishna) దర్శకత్వంలో వారాహి చలనచిత్ర బ్యానర్ పై రజిని కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాతో ఎవర్ గ్రీన్ హీరోయిన్ జెనీలియా (Genelia )కూడా టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా ఇన్నేళ్ల తర్వాత తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్, మలయాళం భాషలలో పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతోంది.
టీజర్ తో ఆకట్టుకున్న జూనియర్..
ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి వరుస అప్డేట్స్ వదులుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ అందుకోగా.. గత మూడు రోజుల క్రితం టీజర్ కూడా రిలీజ్ చేశారు. అందులో హీరో ఫ్రెండ్షిప్ కోసం ఏదైనా చేసే వాడిగా చూపించారు.. అంతేకాదు బీటెక్ చదువుకునే ఈ హీరో నాలుగేళ్లలో చదువు ఎప్పుడైనా చదువుకోవచ్చు.. మెమోరీస్ ముఖ్యమంటూ స్నేహితులు, గొడవలు అంటూ ఉంటాడు. ఇక శ్రీ లీల లైఫ్లో ఒక గోల్ లేనివాడు అసలు మనిషే కాదు అనుకునే అమ్మాయి క్యారెక్టర్ పోషించింది. అలాంటి వీరిద్దరి మధ్య లవ్ ఎలా వర్కౌట్ అవుతుందనేది ఈ కథ .ఈ టీజర్ లాస్ట్ లో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్.. అదేనండి జెనీలియా కూడా ఎంట్రీ ఇస్తుంది .మొత్తానికి ఈ టీజర్ సోషల్ మీడియాలో కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.
జూనియర్ ఆలస్యం.. ఆ తరహాలో శ్రీ లీల రివేంజ్..
ఇలా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా బృందానికి తాజాగా శ్రీ లీల గట్టి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. జూనియర్ సినిమాపై శ్రీ లీల అసహనం వ్యక్తం చేస్తోంది. అందులో భాగంగానే మూవీ ప్రమోషన్స్ లో కూడా పాల్గొనడం లేదు అని సమాచారం. వాస్తవానికి ఎప్పుడో ఈ సినిమా విడుదల అవ్వాల్సి ఉంది. కానీ హీరో ఆలస్యం వల్లే ఈ సినిమా విడుదల ఇంకా ఆలస్యం అవుతూ వచ్చింది. నిజానికి శ్రీ లీల ఫస్ట్ మూవీ కావాల్సింది కానీ ఇలా లేట్ అయిపోయింది. దీంతో ఈ సినిమాపై అసహనం వ్యక్తం చేయడమే కాకుండా రివేంజ్ ఈ తరహాలో తీసుకోబోతున్నట్లు సమాచారం.
ప్రమోషన్స్ కి నో.. చిత్ర బృందానికి శ్రీ లీల ఝలక్..
తన మొదటి సినిమా ఆలస్యం చేశారు కాబట్టి ఇప్పుడు ఈమె పాపులారిటీని యూస్ చేసుకొని సినిమా ప్రమోట్ చేయాలని చూస్తున్న చిత్ర బృందానికి ఈమె గట్టి ఝలక్ ఇచ్చింది. ఇకపోతే శ్రీ లీల మొదటి సినిమానే అయినా ఈ సినిమా కోసం ఏకంగా రూ.3 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది.. పైగా మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కొడుకు హీరోగా వస్తున్న మొదటి సినిమా కావడంతో అటు బడ్జెట్.. ఇటు రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఎక్కడ తగ్గలేదు. మొత్తానికి ఇప్పుడు ప్రమోషన్స్ కి రాకుండా చిత్ర బృందానికి భారీ షాక్ ఇచ్చింది శ్రీలీల.