BigTV English

Trolls On Allu Ayaan : ఫుట్ బాల్ జెర్సీ వేసి ఆర్సీబీ ఫ్యాన్ అంటాడేంటి ?

Trolls On Allu Ayaan :  ఫుట్ బాల్ జెర్సీ వేసి ఆర్సీబీ ఫ్యాన్ అంటాడేంటి ?

Trolls On Allu Ayaan : ఐపీఎల్ 2025 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలిసారిగా టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. అయితే విరాట్ కోహ్లీ జెర్సీ 18.. ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అయి 2025 సీజన్ కి 18 ఏళ్లు.. ఇక ఈ ఏడాదే విరాట్ కోహ్లీ ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్సీబీ జట్టు ట్రోఫీ సాధించింది. ఐపీఎల్ సందర్భంలో ఎప్పుడూ విరాట్ కోహ్లీ ప్రస్తావన వచ్చినా.. వినబడే లోటు, ట్రోల్ చేసే థాట్ కి ఆస్కారం ఇచ్చే అంశాన్ని.. ఈ సారి ఆర్సీబీ జట్టు అధిగమించింది. 18వ ఐపీఎల్ సీజన్ లో ఐపీఎల్ ట్రోఫీని అందుకొని.. కొత్త శకానికి నాంది పలికింది. గ్రౌండ్ లో విరాట్ కోహ్లీ కళ్లు కన్నీటి పర్ంతమయ్యాయి. అది చూసిన అభిమానులు ఎమోషన్ లో మునిగిపోయారు.  దేశవ్యాప్తంగా ఉన్న విరాట్ అబిమానులు అర్థరాత్రి రోడ్ల పైకి వచ్చి సంబురాలు అంబరాన్ని అంటేవిధంగా రచ్చ చేశారు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రతీ రాష్ట్రంలో కోహ్లీ అభిమానులు టపాసులతో దీపావళిని తలపించారు.


Also Read : Ambani Family – IPL : ఐపీఎల్ లో ముంబై ఓనర్లకు సోఫాలు ఎందుకు వేస్తారు.. మిగతా ఓనర్లు జనాల మధ్యలో కూర్చుంటారు

ఇదిలా ఉంటే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ తనయుడు అయాన్ కింగ్ కోహ్లీకి సూపర్ ఫ్యాన్ అని.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ విజయం సాధించిన వేళ.. నిజమైన అభిమాని ఎమోషనల్ ఎలా ఉంటుందో.. అలా అల్లు అయాన్ భావోద్వేగానికి గురయ్యాడు. ఆ మూవ్మెంట్ ని క్యాప్చర్ చేసిన అల్లు అర్జున్ ఆ వీడియో ని షేర్ చేశాడు. ఇదిలా ఉంటే.. అల్లు అయాన్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా ట్రోలింగ్ చేయడం గమనార్హం. ఐపీఎల్ స్టార్టింగ్ లో సన్ రైజర్స్ ఫ్యాన్ అన్నాడు. ఇప్పుడు ఆర్సీబీ ఫ్యాన్ అంటున్నాడు. ఆర్సీబీ గెలిచన సమయంలో  కూడా ఏదో ఫుట్ బాల్ జెర్సీ వేసుకుని ఆర్సీబీ ఫ్యాన్ అంటూ నీళ్లు పైన పోసుకుని రచ్చ రచ్చ చేశాడు. ఈ 14 ఏళ్ల అబ్బాయి.. 18 ఏళ్ల నుంచి కప్ కోసం ఎదురుచూస్తున్నాడా..? అంటూ ట్రోల్స్ వస్తున్నాయి.


ఐపీఎల్ 2025 ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించగానే విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. అయితే నిన్న బెంగళూరు లోని చిన్న స్వామి స్టేడియంలో విజయోత్సవ సంబురాలు జరిపిన విషయం తెలిసిందే. ఈ సంబురాల్లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించారు. మరోవైపు గత ఏడాది అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ రిలీజ్ సందర్భంగా తొక్కిసలాటలో ఒక మహిళా మరణిస్తే.. రాద్దాంతం చేశారు. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది.. మరి 11 మంది మరణిస్తే.. ఎందుకు అలా వ్యవహరించడం లేదని కొందరూ సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ చేయడం విశేషం. వాస్తవానికి తప్పు ఎవరిది అయినా అందరూ బాధ్యులే అని కొందరూ అంటుంటే.. లేదు ఆర్సీబీ జట్టు యాజమాన్యందే అని మరికొందరూ ఇలా రకరకాలుగా పేర్కొనడం గమనార్హం.

 

Related News

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

BCCI: కోహ్లీ, రోహిత్ కు ఎదురుదెబ్బ…2027 కోసం బీసీసీఐ కొత్త ఫార్ములా…గంభీర్ కుట్రలేనా ?

Rohit Sharma Lamborghini : రోహిత్ శర్మ కారు నెంబర్ వెనుక ఉన్న సీక్రెట్ ఇదే.. వాళ్లపై ప్రేమతో

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Big Stories

×