BCCI New Rules: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ లో ఓటమి తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన బీసీసీఐ.. భారత క్రికెట్ జట్టుకు సంబంధించి పది కొత్త మార్గదర్శకాలు {BCCI New Rules} జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ 10 కొత్త మార్గదర్శకాలలో ఒకటి.. బ్యాగేజీ విషయంలో ప్లేయర్లంతా నిబంధనలకు కట్టుబడి ఉండాలని, ఒకవేళ ఏ ఆటగాడు అయినా పరిమితికి మించి బ్యాగేజీ తీసుకువెళ్తే అందుకు అయ్యే ఖర్చులను వారే భరించాల్సి ఉంటుందని రూల్ తీసుకువచ్చింది.
Also Read: Telugu Warriors Team: ఉప్పల్ లో తెలుగు వారియర్స్ రచ్చ… కుర్చీ మడతపెట్టి అంటూ !
ఈ {BCCI New Rules} రూల్ ద్వారా లగేజీని ఒక క్రమ పద్ధతిలో నిర్వహించడంతోపాటు అనవసరపు ఖర్చులు తగ్గించేందుకు వీలు అవుతుందని బీసీసీఐ పేర్కొంది. అయితే తాజాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో ఓ స్టార్ ప్లేయర్ ఏకంగా 27 బ్యాగులు తీసుకువెళ్లాడట. తాజాగా ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీజీటీ సందర్భంగా ఓ స్టార్ ఆటగాడు తన వెంట 27 బ్యాగులు, ట్రాలీ బ్యాగ్ లని తీసుకువెళ్లాడని బీసీసీఐ ఉన్నత అధికారి ఒకరు తెలిపారు.
అతని సామాను మొత్తం బరువు 250 కిలోల కంటే ఎక్కువే ఉందట. తనతో పాటు కుటుంబ సభ్యులు, అతడి సిబ్బంది లగేజీ, 17 బ్యాట్లతో కలిపి 250 కిలోలకు పైగా లగేజీకి బీసీసీఐ నుంచి చార్జి కట్టించినట్లు తెలుస్తోంది. దీని ఖర్చు లక్షల్లో ఉంటుందని సమాచారం. వాస్తవానికి కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది బ్యాగులను విడివిడిగా తీసుకువెళ్లాలి. కానీ ఆ స్టార్ క్రికెటర్ ఈ ఖర్చును బీసీసీఐ చెల్లించేలా లగేజీలో చేర్చాడని వెల్లడించారు.
ఈ లగేజ్ భారత్ నుండి ఆస్ట్రేలియాకు, ఆస్ట్రేలియాలో ఒక నగరం నుండి మరో నగరానికి.. మళ్లీ తిరిగి భారతదేశానికి రావడానికి అయ్యే మొత్తం ఖర్చుని బీసీసీఐ చెల్లించిందట. అంతేకాదు ఆ స్టార్ క్రికెటర్ ని చూసి ఇతర ఆటగాళ్లు కూడా అదే చేయడం ప్రారంభించారట. దీంతో లగేజ్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని భావించిన బీసీసీఐ.. ఈ {BCCI New Rules} నిబంధన తీసుకువచ్చింది. ఇప్పుడు ప్రతి ఆటగాడు ఇతర దేశాల పర్యటనలకు వెళ్లే సందర్భంలో కేవలం 150 కిలోల లగేజీని మాత్రమే తీసుకువెళ్ళడానికి బీసీసీఐ అనుమతి ఇచ్చింది.
అలా కాకుండా అదనపు లగేజీని తీసుకువస్తే.. అందుకు అయ్యే ఖర్చును విమానయాన సంస్థలకు అతడే చెల్లించవలసి ఉంటుంది. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో ఓ స్టార్ ప్లేయర్ ఇలా 250 కిలోలకు పైగా లగేజీని తీసుకు వెళ్ళాడు అన్న వార్త తెలిసిన క్రీడాభిమానులు అతడి పై దుమ్మెత్తి పోస్తున్నారు. బీసీసీఐ నిధులను దుర్వినియోగం చేయడం సరైనది కాదని.. సొంత డబ్బుతో టికెట్ తీసుకోవచ్చు కదా..! అని విమర్శిస్తున్నారు.