Ongole Bull : వ్యవసాయ ప్రధానమైన మన భారత్ లో ఒంగోలు జాతి ఎద్దులంటే ఎంతో ప్రత్యేకం. కొండలాంటి దీని మోపురం, బలమైన శరీరం, ఎంతటి బరువునైనా సులువుగా లాగి పడేసే శక్తితో ఒంగోలు గిత్తలు ఆకట్టుకుంటాయి. కేవలం ఏపీలోని కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా ఒంగోలుకు మాత్రమే పరిమితమైన ఈ జాతి ఎద్దులు.. మన దగ్గర చాలా నిర్లక్ష్యానికి గురయ్యాయనేది చారిత్రక వాస్తవం. ఈ జాతిలోని సంకరాన్ని నివారించి, స్వచ్ఛమైన ఒంగోలు గిత్తల్ని, ఆవుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత్ని మనం మర్చిపోయాం. కానీ.. దేశం కానీ దేశంలో మన ఒంగోలు గిత్తలు మంచి ఆదరణను అందుకుంటున్నాయి. ఎంతలా అంటే.. ఒంగోలు జాతికి చెందిన వియాటినా-19 అనే ఆవునును బ్రెజిల్లో వేలంలో వేస్తే.. ఏకంగా 4.82 మిలియన్ యుఎస్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 41 కోట్లు మేర ధర పలికింది. దీంతో.. ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్ అవుతోంది.
వేలంలోని ధరతో అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ ఆవు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా నిలిచింది. మన దగ్గర ఒంగోలు జాతి పశువుల సామర్థ్యం, రాజసానికి ముచ్చటపడిన బ్రెజిల్ వాసులు.. తరాల నాడు ఈ జాతి ఆవులు, ఎద్దుల్ని అక్కడికి తరలించారు. స్వచ్ఛమైన ఒంగోలు జాతిని పునరుత్పత్తి చేస్తూ.. అక్కడ వినియోగిస్తున్నారు. బ్రాహ్మిణ్ కేటిల్ గా విదేశాల్లో బాగా ప్రాచుర్యం పొందిన ఈ జాతి పశువులు..
సరైన సంరక్షణ, శాస్త్రీయంగా అభివృద్ధి చేస్తే అద్భుతాలు సృష్టిస్తాయని చెబుతున్నారు. కాగా.. ఈ జాతిని బ్రెజిల్ లో క్రమం తప్పకుండా వేలం వేస్తారు. 2023లో బ్రెజిల్లోని అరండులో జరిగిన ఓ వేలంలో.. వియాటినా-19 4.3 మిలియన్ యుఎస్ డాలర్లు పలికింది. గతేడాది కూడా ఇలానే.. దాదాపు 4.8 మిలియన్ల డాలర్ల మేర ఒంగోలు జాతి ఆవు ధర పలికింది. ఈ ఏడాది కూడా అనే ఒరవడిని సృష్టిస్తూ.. బ్రెజిల్లోని మినాస్ డిస్లో నిక్వగింటిన వేలంలో 4.82 మిలియన్లు పలికి.. ఆశ్చర్యపరిచింది.
ఒంగోలు జాతి పశువులకు అధిక శక్తి, వ్యాధుల నిరోధక శక్తి, అనువైన శరీర నిర్మాణం వల్ల ఇవి వేడి వాతావరణ పరిస్థితులనూ తట్టుకుంటుంది. అందుకే.. ఈ జాతి పశువులను బ్రెజిల్ లోకి 19వ శతాబ్దంలోకి ప్రవేశించింది. అప్పుడు.. 19వ శతాబ్దంలో అంటే.. 1800 యూరోపియన్, పోర్చుగీస్ వలసదారులు బ్రెజిల్ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు భారత్ నుంచి ఆవులు, ఎద్దులను దిగుమతి చేసుకున్నారు. ఈ క్రమంలో ఒంగోలు జాతి ఎద్దులు భారత్ నుంచి తొలిసారిగా 1830-1860 మధ్య కాలంలో బ్రెజిల్‌కు తరలిపోయాయి.
Also Read : ఏపీలో రోజు రోజుకి పెరుగుతున్న GBS కేసులు.. ఆందోళనలో ప్రజలు
బలమైన కండరాల నిర్మాణంతో ప్రత్యేకమైన జన్యు లక్షణాలకు ఈ జాతి ప్రసిద్ధి. అయితే, భారత్ లో ఈ జాతి సంరక్షణపై శ్రద్ధ, సంరక్షణ కోసం ఇబ్బంది పడుతుండగా.. బ్రెజిల్ వంటి దేశాలు దాని పూర్తి సామర్ధ్యాన్ని ఉపయోగించుకుంటోంది. మంచి నాణ్యమైన స్పెర్మ్ ఉత్పత్తిని చేస్తూ.. దాని ద్వారా ఉత్తమమైన జాతుల్ని సృష్టిస్తున్నాయి. ఒంగోలు పశువుల అభివృద్ధిలో భారీగా పెట్టుబడి పెట్టిన బ్రెజిల్, జాతి జన్యు నాణ్యతను పెంచడంలో అసాధారణ విజయాన్ని సాధించింది. బ్రెజిల్లోని మినాస్ గెరైస్ ప్రాంతంలో పెరిగిన వియాటిన జాతి ఇందులో ముందు వరుసలో ఉంది. ఈ జాతి పశువులు.. 1,101 కిలోల బరువుతో, బాగా అభివృద్ధి చెందిన కండరాల నిర్మాణం, అద్భుతమైన మూపురంతో ఆకట్టుకుంటోంది.