BigTV English

Metro Rail: మెట్రో రైల్ సెకండ్ ఫేజ్.. క్లారిటీ ఇచ్చిన కేటీఆర్..

Metro Rail: మెట్రో రైల్ సెకండ్ ఫేజ్.. క్లారిటీ ఇచ్చిన కేటీఆర్..

Metro Rail: హైదరాబాద్. మోస్ట్ హాపెనింగ్స్ సిటీ. ఐటీ నగరం. స్టార్టప్స్ కు కేంద్రం. అందుకే, అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పిస్తోంది ప్రభుత్వం. ఫ్లైఓవర్స్ తో నగరాన్ని నింపేస్తోంది. లేటెస్ట్ గా, ఐటీ కారిడార్‌ను ORRతో లింక్ చేస్తూ.. శిల్పా లేఅవుట్‌ ఫస్ట్ ఫేజ్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు మంత్రి కేటీఆర్‌.


2.8 కిలోమీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పుతో.. దాదాపు 250 కోట్ల ఖర్చుతో నిర్మించారు. హైదరాబాద్ లోనే రెండో పొడవైన ఫ్లైఓవర్‌. ఐకియా మాల్‌ వెనక మొదలై… ఎత్తైన, అందమైన బిల్డింగుల మధ్య నుంచి నేరుగా ఓఆర్‌ఆర్‌పైకి చేరుతుంది. ఐటీ పీపుల్ కి ఎంతో యూజ్ ఫుల్ గా ఉంటుంది.

ఫ్లైఓవర్ తో పాటు మరో గుడ్ న్యూస్ కూడా చెప్పారు మంత్రి కేటీఆర్. త్వరలో మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేయబోతున్నట్టు తెలిపారు. రెండవ దశలో 63 కిలోమీటర్ల మేర మెట్రో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకపూల్ వరకు 26 కిలోమీటర్లు, ఎల్బీనగర్ నుంచి నాగోల్ వరకు 5 కిలోమీటర్లు, రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్ట్ వరకు 32 కిలోమీటర్ల దూరం మెట్రో రైలు ప్రాజెక్టు చేపడతామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని, కేంద్రం సహకరించకపోయినా మెట్రో రైలు సెకండ్ ఫేజ్ కంప్లీట్ చేస్తామని కేటీఆర్ తేల్చిచెప్పారు.


స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌-SRDPలో భాగంగా 48 ప్రాజెక్టుల్లో.. ఆరేళ్లలో 33 రోడ్డు నిర్మాణాలను పూర్తి చేశామన్నారు కేటీఆర్. నగరంలో 710 కిలోమీటర్లకుపైగా మెయిన్‌ రోడ్లను ఎంత వర్షం పడినా దెబ్బతినకుండా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నట్టు చెప్పారు. ఇక, ఎంఎంటీఎస్‌ విస్తరణ కోసం 200 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. వచ్చే ఏడాది జనవరిలో కొండాపూర్‌ జంక్షన్ ఫ్లైఓవర్ కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంచినీరు, కరెంటు, రోడ్లు, శాంతిభద్రతలను సెట్ చేశామని.. ఇక డ్రైనేజీ సిస్టమ్ ను బాగు చేసుకోవాల్సి ఉందన్నారు కేటీఆర్.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×