E-Paper
Advertisement

IND VS ENG 2nd Semi-Final: వాంఖ‌డే స్టేడియంకు వచ్చే 33వేల మంది నోర్లు మూయిస్తాం..టీమిండియాకు మ‌రిచిపోని ఓట‌మి చూపిస్తాం

IND VS ENG  2nd Semi-Final: వాంఖ‌డే స్టేడియంకు వచ్చే 33వేల మంది నోర్లు మూయిస్తాం..టీమిండియాకు మ‌రిచిపోని ఓట‌మి చూపిస్తాం
Advertisement

IND VS ENG 2nd Semi-Final:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) సెమీ ఫైనల్ పోరు షురూ కానుంది. ఇవాళ న్యూజిలాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా ( South Africa vs New Zealand) మధ్య తొలి సెమీ ఫైనల్ జరగనుండగా, రేపు టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ ( Team India vs England) మధ్య రెండో సెమీ ఫైనల్ ఉంటుంది. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే రెండో సెమీ ఫైనల్ ముంబైలోని వాంఖ‌డే స్టేడియం ( wankhede stadium ) వేదికగా నిర్వహిస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో టీమిండియాకు స్ట్రాంగ్ వార్నింగ్ పంపాడు ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ సామ్ కర్రన్ ( Sam Curran ). ముంబై వాంఖ‌డే స్టేడియం మొత్తం సైలెంట్ అయ్యేలా చేస్తామని.. చరిత్రలో మర్చిపోని ఓటమిని టీమిండియాకు చవి చూపిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు సామ్ కర్రన్. తమ దెబ్బకు టీమిండియా కోలుకోవడానికి నెలలు పడుతుందని హెచ్చరించారు.

Also Read : BCCI vs PCB Salary Clash: పాకిస్తాన్ క్రికెట‌ర్ల జీతాలు ఎంతో తెలుసా ? టీమిండియా ప్లేయ‌ర్ల కాలిగోటికి కూడా స‌రిపోవా

వాంఖ‌డే స్టేడియం సైలెంట్ చేస్తాం.. ఇండియాలో ఓడిస్తాం

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రెండో సెమీ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. ముంబైలోని వాంఖ‌డే స్టేడియం ( wankhede stadium ) వేదికగా ఈ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో… టీమిండియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ సామ్ కర్రన్ ( Sam Curran ). వాంఖ‌డే స్టేడియానికి వేలాది సంఖ్యలో అభిమానులు వస్తారని పేర్కొన్నారు. ఇక వాళ్లందరూ సైలెంట్ గా ఉండేలా మేము ప్లాన్ చేస్తున్నాం.. ఇండియాను ఓడిస్తే వాళ్ళు గమ్మున కూర్చుంటారని చురకలు అంటించారు. క్రికెట్ హిస్ట‌రీలో మర్చిపోలేని ఓటమిని టీమిండియా చవిచూడబోతుందని హెచ్చరించారు. అభిషేక్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు.. అయితే అతన్ని త్వరగా ఔట్ చేసేందుకు తమ దగ్గర రామబాణం ఉందని వ్యాఖ్యానించారు. ఏదేమైనా సెమీ ఫైనల్ లో ఇండియాపై ఇంగ్లాండ్ గెలుస్తుందని వ్యాఖ్యానించారు సామ్ కర్రన్.

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య గత రికార్డులు

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సెమీఫైనల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య గత రికార్డులు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ రెండు జట్ల మధ్య ఐసీసీ టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్లో మొత్తం ఐదు మ్యాచ్ లు జరిగాయి. 2007 నుంచి 2024 వరకు చూసుకున్నట్లయితే… ఈ ఐదు మ్యాచ్లలో ఒక టీమిండియానే పై చేయి సాధించింది. ఇంగ్లాండ్ పై మొత్తం మూడు మ్యాచ్ లలో ఇండియా గెలవగా… రెండు మ్యాచ్ లు ఆంగ్లేయులు విజయం సాధించారు. చివరిసారిగా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 2024 సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో 68 పరుగుల తేడాతో టీమిండియానే విజయం సాధించింది. ఇక ఇప్పుడు మరోసారి మార్చి 5వ తేదీన ఈ రెండు జట్లు సెమీఫైనల్ స్టేజీలో తలపడుతున్నాయి.

Advertisement

Also Read: Ban On Sanju Samson: సంజుపై ఐసీసీ నిషేధం…సెమీ ఫైన‌ల్ నుంచి ఔట్, ఆ హెల్మెటే కొంప‌ముంచిందా ?

 

 

?igsh=MTd5bTl6dnp4dnJraQ==

 

 

Related News

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

Big Stories

Advertisement
×