Chhaava : ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన హిస్టారికల్ మూవీ ‘ఛావ’ (Chhaava). డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) తెరకెక్కించిన ఈ మూవీ ఫిబ్రవరి 14న రిలీజ్ అయ్యి, కలెక్షన్ల ఊచకోత కోస్తోంది. ఈ మూవీలో ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ (Vicky Kaushal), విలన్ ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా నటించారు. వీరిద్దరి పాత్రలపై ప్రశంసల వర్షం కురుస్తుంది. కానీ హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్న (Rashmika Mandanna)పై మాత్రం విమర్శలు వినిపిస్తున్నాయి. సినిమాలో అతిపెద్ద మైనస్ రష్మిక అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి దీనికి కారణం ఏంటంటే…
‘ఛావా’లో అతిపెద్ద మైనస్ హీరోయినే
‘ఛావా’ మూవీ నటీనటులను అనౌన్స్ చేసినప్పుడు, రష్మిక మందన్న మహారాణి యేసు బాయి పాత్రను పోషిస్తుందని ప్రకటించినప్పుడు అందరి మదిలో మిగిలిన ప్రశ్న ఒక్కటే… మరాఠా రాణిగా ఒక సౌత్ హీరోయిన్ ఎలా నటించగలదు? సినిమా విడుదలైన తర్వాత ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది. కానీ ఆ సమాధానం మాత్రం పాజిటివ్ గా లేదు. ఈ మూవీలో వినిపిస్తున్న ప్రధాన విమర్శలలో రష్మిక మందన్న మహారాణి యేసుబాయి పాత్రను పోషించడం. ముఖ్యంగా సినిమాలో ఆమె డైలాగ్స్… కళ్ళతో భావాలను పలికించడం, ఎమోషన్స్ అన్నీ బాగున్నప్పటికీ, డైలాగ్ డెలివరీ మాత్రం కరెక్ట్ గా లేదనే అసంతృప్తి వ్యక్తం అవుతుంది.
సాధారణ రాజవంశం మాట్లాడే స్వచ్ఛమైన హిందీని మాట్లాడడానికి ఆమె చేసిన ప్రయత్నం వర్కౌట్ కాలేదు అనే టాక్ నడుస్తోంది. ముంబైలో జరిగిన ట్రైలర్ బ్రాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ రష్మిక మందన్నను హీరోయిన్ గా తీసుకుందాం అని చెప్పినప్పుడు నిర్మాత దినేష్ విజన్ కూడా ఆశ్చర్యపోయాడని వెల్లడించారు. అయితే ఆమెను మరాఠా రాణిగా ఆమెను ఎంపిక చేయడానికి కారణం రష్మిక కళ్ళల్లో కనిపించిన స్వచ్ఛత అని, అది మరాఠీ మహారాణి కళ్ళను పోలి ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చారు.
సినిమాటోగ్రాఫర్ నుంచి డైరెక్టర్ గా మారిన లక్ష్మణ్ ఉటేకర్ ఆమెలో చూసిన లక్షణాన్ని పర్ఫెక్ట్ గా తెరపై చూపించగలిగాడు. కానీ డైలాగ్స్ విషయంలో మాత్రం మరింత శ్రద్ధ చూపి ఉంటే బాగుండేది అంటున్నారు. డైలాగ్ రైటర్ రిషి విర్మాణి ‘ఛావా’ మూవీలోని డైలాగ్స్ ను అద్భుతంగా రాసినప్పటికీ, రష్మిక మందన్న ఆ డైలాగ్ డెలివరీలో దక్షిణ భారత యాసలో ఉందని, పర్ఫెక్ట్ మరాఠా యాసలో డైలాగులను చెప్పడంలో ఫెయిల్ అయ్యిందని అంటున్నారు. ఒకవేళ స్పష్టంగా మరాఠీ మాట్లాడగలిగే డబ్బింగ్ ఆర్టిస్ట్ ని ఉపయోగించుకుని ఉంటే సినిమా మరింత ఎఫెక్టివ్ గా ఉండదనే టాక్ విన్పిస్తోంది.
‘యానిమల్’లోనూ సేమ్ సీన్
రష్మిక మందన్నపై ఇలాంటి కామెంట్స్ రావడం ఇదే మొదటిసారి కాదు. 2023 లో రిలీజ్ అయిన ‘యానిమల్’ మూవీ ట్రైలర్ రిలీజ్ టైం లో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ట్రైలర్లో ఆమె డైలాగ్ డెలివరీపై తీవ్రంగా ట్రోల్ నడిచింది. అయితే సినిమా రిలీజ్ అయ్యాక ఆమె యాక్టింగ్ తో వాటికి సమాధానం చెప్పింది. కానీ రష్మిక ‘ఛావా’ మూవీతో అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయింది.