BigTV English
Advertisement

Rachin Ravindra: రావల్పిండి స్టేడియంలో ఉగ్రమూకలు.. రచిన్ రవీంద్రపై దాడి ?

Rachin Ravindra:  రావల్పిండి స్టేడియంలో ఉగ్రమూకలు.. రచిన్ రవీంద్రపై దాడి ?

Rachin Ravindra: చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో.. పాకిస్తాన్ సర్కార్ భద్రత లోపాలు స్పష్టంగా తెరపైకి వస్తున్నాయి. పాకిస్తాన్ దేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ఈసారి జరుగుతోంది. హైబ్రిడ్ మోడల్ లో జరుగుతున్న నేపథ్యంలో ఇండియా మ్యాచ్ లన్ని దుబాయిలో నిర్వహిస్తున్నారు. కాబట్టి టీమిండియా కు ఎలాంటి ప్రమాదాలు లేవు. మిగతా మ్యాచ్ లన్ని పాకిస్తాన్ దేశంలో నిర్వహిస్తోంది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. అయితే పాకిస్తాన్ దేశంలో జరుగుతున్న మ్యాచ్లకు ప్రమాదం పొంచి ఉందని తాజాగా పాకిస్తాన్ ఇంటలిజెన్స్ గుర్తించింది. పాకిస్తాన్ దేశంలో క్రికెట్ మ్యాచ్లు చూసేందుకు వచ్చిన విదేశీ క్రికెట్ అభిమానులను కిడ్నాప్ చేసేందుకు ఉగ్రవాద సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నారట. నిన్నటి నుంచి ఈ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.


Also Read: SA vs Aus: భారీ వర్షం.. ఆస్ట్రేలియా వర్సెస్‌ దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దు..టీమిండియాకు పెను ప్రమాదం !!

అయితే తాజాగా మరో వీడియో… భయానక పరిస్థితులను పరిచయం చేస్తోంది. నిన్న పాకిస్తాన్లోని రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఆల్రౌండర్… రచిన్ రవీంద్ర బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో ఓ అజ్ఞాత వ్యక్తి స్టేడియంలోకి దూసుకు వచ్చాడు. ఏదో ఫోటో పట్టుకొని వైట్ డ్రెస్ వేసుకున్న అజ్ఞాత వ్యక్తి… రచిన్ రవీంద్ర వైపు పరుగులు పెట్టాడు. దీంతో భయపడిపోయిన రచిన్ రవీంద్ర… ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో నిలబడిపోయాడు. దీంతో ఆ అజ్ఞాత వ్యక్తి వెంటనే రవీంద్రా ను గట్టిగా హాగ్ చేసుకున్నాడు. అంతలోనే సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి అతన్ని పట్టుకొని వెళ్లారు. మామూలుగా ఇతర దేశాలలో ఇలా ఫ్యాన్స్ రావడం మామూలే. కానీ పాకిస్తాన్ లాంటి దేశాలలో ఇలా అజ్ఞాత వ్యక్తులు స్టేడియంలోకి వచ్చి హగ్ ఇస్తే… అందరూ భయపడి పోవాల్సిందే.


ఉగ్రవాదులకు కేరాఫ్ అడ్రస్ గా మారిన పాకిస్తాన్లో మ్యాచ్లు ఆడుతున్నప్పుడు సెక్యూరిటీని… అక్కడి ప్రభుత్వం కట్టుదిట్టం చేయాల్సి ఉంటుంది. కానీ ఈ విషయంలో పాకిస్తాన్ సర్కార్ దారుణంగా విఫలమైందని అంటున్నారు. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో ఏంటో తెలియదు కానీ… నేరుగా వచ్చి రవీంద్రా ను పట్టుకున్నాడు. అతడు ఉగ్రవాది అయి ఉంటే అక్కడ పెను ప్రమాదమే జరిగిండేది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో చూసిన ఇండియన్ ఫ్యాన్స్… రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. పాకిస్తాన్ గ్రౌండ్లో ఉగ్రవాదులు చొరబడ్డారని కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే విదేశీ క్రికెట్ అభిమానులను కిడ్నాప్ చేసేందుకు పాకిస్తాన్ ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ సెమీస్ కు దూరం అయిందన్న బాధతో అక్కడి అభిమానులు ఇలా దౌర్జన్యానికి పాల్పడుతున్నారని కూడా ఆగ్రహిస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్. అందుకే పాకిస్తాన్ దేశంలో ఇలాంటి ఐసీసీ టోర్నమెంట్లు నిర్వహించకూడదని కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలాగే జరిగితే పెను ప్రమాదాలే ఉంటాయని హెచ్చరిస్తున్నారు. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వెంటనే స్పందించాలని కూడా గుర్తు చేస్తున్నారు.

Related News

IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్‌, ఐపీఎల్ 2026 రిటెన్ష‌న్ ఎప్పుడంటే?

Ind vs aus 5Th T20I : స్టేడియంలో ఉరుములు, మెరుపులు మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

Abhishek Sharma : కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. ఏకంగా 1000 పరుగులు.. మ్యాచ్ రద్దు?

Shah Rukh Khan – Pujara : పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఆ ఆప‌రేష‌న్ కు సాయం !

Mohammed Shami : రూ .4 లక్ష‌లు చాల‌డం లేదు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే..ష‌మీ భార్య సంచ‌ల‌నం

IND VS AUS 5th T20I: టాస్ ఓడిన టీమిండియా..తెలుగోడిపై వేటు, డేంజ‌ర్ ఫినిష‌ర్ వ‌స్తున్నాడు

Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవ‌మానం..కానీ అంత‌లోనే ట్విస్ట్‌, ICC బాస్ జై షా నుంచి పిలుపు

Hong Kong Sixes 2025: దినేష్ కార్తీక్ చెత్త కెప్టెన్సీ.. కువైట్, UAE చేతిలో వ‌రుస‌గా ఓడిన టీమిండియా

Big Stories

×