SA vs Aus: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో ( Champions Trophy 2025 Tournament ) భాగంగా ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( Australia vs South Africa ) మధ్య ఇవాళ జరిగే పోరు పాకిస్థాన్ లోని రావల్పిండి క్రికెట్ స్టేడియం వేదికగా జరగాల్సి ఉండగా.. ఈ మ్యాచ్ రద్దు అయింది. పాకిస్థాన్ లోని రావల్పిండి లో ఉదయం నుంచి భారీ వర్షం కురిసింది. మ్యాచ్ టాస్ సమయానికి వర్షం తగ్గినప్పటికీ… మైదానం మొత్తం తడిగా తయారయింది. దీంతో టాస్ ప్రక్రియ కాస్త ఆలస్యంగా వేస్తారని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత మళ్లీ వర్షం కురిసింది. దీంతో ఇవాళ మ్యాచ్ ఆడే పరిస్థితి ఉండబోదని అంపైర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మ్యాచ్ రద్దు చేస్తూ… ప్రకటన చేశారు. అంతేకాదు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు అంపైర్లు.
Also Read: Fan With Indian Flag: పాకిస్తాన్ లో ఇండియన్ అరెస్ట్.. జాతీయ జెండా పట్టుకున్నాడని!
టీమిండియాకు పెను ప్రమాదం:
వర్షం కారణంగా దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ రద్దయింది.. దీంతో చెరో మూడు పాయింట్లతో ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ లో ఉన్నాయి ఈ రెండు జట్లు. ఇటు ఇప్పటికే న్యూజిలాండ్ అలాగే టీమిండియా సెమీఫైనల్ కు వెళ్లాయి. గ్రూప్ ఎ లో టీమిండియా సెకండ్ పొజిషన్లో ఉంది. అటు గ్రూప్ బి లో ఆస్ట్రేలియా కూడా సెకండ్ పొజిషన్ లో ఉంది. కాబట్టి బలమైన ఆస్ట్రేలియాతో సెమిస్ పోరు లో టీమిండియా తలపడే ప్రమాదం పొంచి ఉంది. అదే దక్షిణాఫ్రికా తో అయితే టీమిండియా ఫైనల్ కు నేరుగా వెళ్ళేది. ఆస్ట్రేలియాతో గెలవాలంటే కాస్త కష్టపడాల్సి ఉంటుంది.
ఇక ఇప్పటి వరకు ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన వన్డే మ్యాచ్ లలో సఫారీలు పై చేయి సాధించారు. ఆస్ట్రేలియా లాంటి పెద్ద జట్టును వన్డే మ్యాచ్ లలో దక్షిణాఫ్రికా చిత్తు చేసింది. ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఇప్పటి వరకు 110 వన్డే మ్యాచ్ లు జరిగాయి. ఇందులో ఆస్ట్రేలియా 51 మ్యాచ్ లు ఆడింది. అలాగే…దక్షిణాఫ్రికా టీం మాత్రం 55 వన్డే మ్యాచ్ లు గెలవడం జరిగింది. ఇక ఇప్పటి వరకు…. వన్డేలలో సౌత్ ఆఫ్రికా పై చేయి సాధించగా…. చివరగా ఈ రెండు జట్ల మధ్య జరిగిన… ఐదు వన్డే మ్యాచ్లో కూడా… దక్షిణాఫ్రికా దుమ్ము లేపింది. 2023 సంవత్సరంలో ఈ రెండు జట్ల మధ్య… వన్డే సిరీస్ జరిగింది.
చివరి 5 వన్డే మ్యాచ్ల రిజల్ట్ ఒకసారి పరిశీలిస్తే… ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్ లో గెలిస్తే సౌత్ ఆఫ్రికా నాలుగు మ్యాచ్లో విజయం సాధించింది. అంటే వన్డేలలో ఆసీస్ పైన సంపూర్ణంగా సౌత్ ఆఫ్రికా పెత్తనం చేలాయిస్తోందన్న మాట. ఇక ఇవాళ్టి వన్డే మ్యాచ్ లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. కాగా… ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో గ్రూప్ లో ఏ లో టీమిండియా అలాగే న్యూజిలాండ్ రెండు జట్లు సెమీస్ కు వెళతాయని అంటున్నారు. ఇక గ్రూప్ బీ లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా రెండు జట్లు కూడా సెమీస్ వెళ్లే ఛాన్సులు ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో ( Champions Trophy 2025 Tournament ) భాగంగా జరుగుతున్న మ్యాచ్ లు అన్ని జియో హాట్ స్టార్ లో మనం చూడవచ్చును. ఉచితంగానే…. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ మ్యాచ్ లను ప్రసారం చేస్తోంది జియో హాట్ స్టార్. కానీ జియో నంబర్ తో మాత్రమే లాగిన్ కావచ్చు. ఒక్క జియో నంబర్ కు ఇద్దరు మాత్రమే చూడవచ్చు.
Also Read: Telugu Heroes In IPL: SRH కెప్టెన్ గా పవన్.. ఎందిరా ఈ రచ్చా.. ఐపీఎల్ లోకి హీరోలు !
A WASHOUT IN SOUTH AFRICA VS AUSTRALIA MATCH IN RAWALPINDI.
– England will qualify for the Semis if they beat Afghanistan and SA. 🤯 pic.twitter.com/SlzAzEtoLH
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 25, 2025