BigTV English

Kane Williamson : వావ్ ! కేన్ మామా.. టెస్టుల్లో వేగంగా 32 సెంచరీలతో చరిత్ర!

Kane Williamson : వావ్ ! కేన్ మామా.. టెస్టుల్లో వేగంగా 32 సెంచరీలతో చరిత్ర!
Kane Williamson

Kane Williamson Record 32 Test Centuries : కేన్ మామ.. అంటే భారతీయులందరికీ సుపరిచితం. మ్యాచ్ ల్లో భావోద్వేగాలను బ్యాలన్స్ చేసుకుంటూ కూల్ కెప్టెన్ గా పేరు పొందిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సెంచరీల మీద సెంచరీలు చేసి, అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.


సౌతఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో చేసిన సెంచరీతో అరుదైన ఘనతను సాధించాడు. టెస్టుల్లో వేగంగా 32 సెంచరీలు సాధించిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. 172 ఇన్నింగ్స్ లో ఈ ఘనత సాధించాడు.  

267 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టులో కేన్ విలియమ్సన్ అద్భుత సెంచరీతో జట్టుని విజయం ముంగిట నిలిపాడు. 203 బంతుల ఎదుర్కొని 11 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.


Read More : Sarfaraz Khan’s Run Out: క్యాప్‌తో పాటు, నా బ్యాడ్ లక్ ఇచ్చినట్టుంది.. అనిల్ కుంబ్లే..!

ఇక్కడ మరో అద్భుతం కూడా చెప్పాలి. గత 12 ఇన్నింగ్స్‌ల్లో విలియమ్సన్ ఏడు సెంచరీలు సాధించడం విశేషం. 33 ఏళ్ల విలియమ్సన్ అద్భుతమైన ఫామ్ తో చెలరేగిపోతున్నాడు. అంతేకాదు సౌతాఫ్రికాతో జరిగిన ఫస్ట్ టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ లో రెండు సెంచరీలు (118, 109)  చేసి భళా అనిపించాడు.

అంతకుముందు ఈ రికార్డు స్టీవ్ స్మిత్ పేరిట ఉండేది. స్మిత్ 174 ఇన్నింగ్స్‌‌ల్లో 32 సెంచరీలు సాధించాడు. తర్వాత రికీ పాంటింగ్ (176 ఇన్నింగ్స్), సచిన్ టెండూల్కర్ (179 ఇన్నింగ్స్), యునిస్ ఖాన్ (183 ఇన్నింగ్స్) ఉన్నారు.

ఈ క్రమంలో విలియమ్సన్ వీరందరినీ దాటి ముందుకెళ్లాడు. అంతేకాదు టెస్టుల్లో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కూడా చరిత్ర సృష్టించాడు.

కేన్ విలియమ్సన్ అన్ని ఫార్మాట్లలో కలిపి 45 సెంచరీలు చేశాడు. తన కంటే ముందు విరాట్ కోహ్లి (80), డేవిడ్ వార్నర్ (49), రోహిత్ శర్మ (47), జో రూట్ (46) మాత్రమే ఉన్నారు.

అలాగే న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన నెంబర్ వన్ బ్యాటర్ గా ఉన్నాడు.  రాస్ టేలర్ 19 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. 

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×