BigTV English

Sarfaraz Khan’s Run Out: క్యాప్‌తో పాటు, నా బ్యాడ్ లక్ ఇచ్చినట్టుంది.. అనిల్ కుంబ్లే..!

Sarfaraz Khan’s Run Out: క్యాప్‌తో పాటు, నా బ్యాడ్ లక్ ఇచ్చినట్టుంది.. అనిల్ కుంబ్లే..!

Anil Kumble Reacts After Sarfaraz Khan’s Run Out: టీమ్ ఇండియా యువ సంచలనంగా మారిన సర్ఫరాజ్ ఖాన్ తొలి అంతర్జాతీయ మ్యాచ్‌తో ఘనంగా ఎంట్రీ ఇచ్చాడు. చేసినవి 62 పరుగులే అయినా, టెస్ట్ మ్యాచ్‌ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసి, హార్దిక్ పాండ్యా సరసన నిలిచాడు. ఇంగ్లాండ్‌తో రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు‌లో సర్ఫరాజ్ ఆరంగ్రేటం చేసిన సంగతి అందరికీ తెలిసిందే.


ఈ సందర్భంగా టీమ్ ఇండియా దిగ్గజ క్రికెటర్లలో ఒకరైన అనిల్ కుంబ్లే నుంచి సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్ర క్యాప్‌ను స్వీకరించాడు. అయితే యాదృచ్ఛికంగా జరిగిదో ఏమో తెలీదు. కానీ అనిల్ కుంబ్లే సైతం అరంగేట్ర మ్యాచ్‌లో రనౌట్‌గానే వెనుదిరిగాడు.

జియో సినిమా పోస్ట్ మ్యాచ్ షోలో అనిల్ కుంబ్లే మాట్లాడుతూ.. ఇదే విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. తను ఆరంగేట్ర క్యాప్ ఇవ్వకుండా ఉండాల్సిందని అన్నాడు. ఎందుకంటే నేను కూడా తొలి మ్యాచ్‌లో ఇలాగే రన్ అవుట్ అయ్యాను. ఇప్పుడిది చూస్తుంటే, అరంగేట్ర క్యాప్‌తో పాటు నా బ్యాడ్ లక్‌ను కూడా సర్ఫరాజ్‌కి ఇచ్చినట్టున్నానని సరదాగా వ్యాక్యానించాడు.


Read More: నన్ను క్షమించు భయ్..! సర్ఫరాజుకి చేతులెత్తిదండం పెట్టిన జడేజా..

అక్కడ రన్ అవుట్ అయిన నేపథ్యాన్ని తనదైన శైలిలో వివరించాడు. నిజానికి జడేజా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కానీ సర్ఫరాజ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. నిజానికి జడేజా కూడా దూకుడైన ఆటే ఆడతాడు. ఈసారి మ్యాచ్‌లో రోహిత్ శర్మ, జడేజా ఇద్దరూ వారి సహజత్వానికి భిన్నంగా కంప్లీట్ డిఫెన్సివ్ మోడ్‌లో ఆడారు. సర్ఫరాజ్ వచ్చేసరికి అక్కడ వాతావరణం మారిపోయింది.

నిజానికి అవతల వాళ్లు అలా ఆడుతుంటే, మనలోని సహజత్వం తెలియకుండా బయటకి వస్తుంది. జడేజానే కాదు, రోహిత్ శర్మ ఉన్నా క్విక్ సింగిల్‌కి కాల్ చేసేవాడు. మైండ్‌లో జరిగే ఒక గందరగోళం మధ్యలో తీసుకునే నిర్ణయాల్లో పొరపాట్లు జరుగుతుంటాయి. బహుశా సర్ఫరాజ్ రనౌట్‌కి ఇదే కారణం కావచ్చునని విశ్లేషించాడు.

ప్రపంచంలో జరిగే క్రికెట్ మ్యాచ్‌ల్లో ఎన్నో రన్ అవుట్లు జరుగుతుంటాయి. కానీ ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. కానీ ఈసారి సర్ఫరాజ్ విషయంలో మాత్రం అలా జరగలేదు. కారణం తనది ఆరంగేట్రం మ్యాచ్ కావడం, అంతేకాదు అత్యద్భుతంగా ఆడటమే అందుకు కారణమని సీనియర్లు వ్యాక్యానిస్తున్నారు.

Tags

Related News

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Big Stories

×