
On This Day : క్రికెట్ అనేది నంబర్స్ గేమ్ కావడం వలన యాదృచ్ఛికాలను సృష్టిస్తుంది. వాటిలో కొన్ని విచిత్రమైన సంఘటనలు ఉంటాయి . అలాంటి సంఘటన ఒకటి 11/11/11న జరిగింది. నవంబర్ 11, 2011న, కేప్ టౌన్‌లో దక్షిణాఫ్రికా -ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొదటి టెస్ట్ సందర్భంగా ఆసక్తికరమైన గణాంకాలు నమోదయ్యాయి . మ్యాచ్ గెలవాలంటే దక్షిణాఫ్రికా విజయానికి 236 పరుగులు అవసరం. దక్షిణాఫ్రికా .. మూడవ రోజు 1 వికెట్ నష్టానికి 125 పరుగులు చేసారు.. 11/11/11 ఉదయం 11:11 గంటలకు దక్షిణాఫ్రికా విజయానికి కేవలం 111 పరుగులు మాత్రమే కావాలి.
ఆ నిమిషం పాటు ప్రేక్షకులు, అంపైర్ ఇయాన్ గూల్డ్ ఒంటికాలిపై నిలబడ్డారు. ఇలాంటి సంఘటనలు క్రికెట్లో అరుదుగా జరుగుతుంటాయి. ఈ సంఘటన జరిగి సరిగ్గా నేటికీ 12 ఏళ్ళు.