E-Paper
Advertisement

Iphone 14 Plus : ఆపిల్‌కు షాక్.. ఆ ఫోన్ కొనేవాళ్లే లేరట!

Iphone 14 Plus : ఆపిల్‌కు షాక్.. ఆ ఫోన్ కొనేవాళ్లే లేరట!
Advertisement

Iphone 14 Plus : ప్రపంచవ్యాప్తంగా సేల్స్ పెరిగి ఆదాయం కూడా భారీ స్థాయిలో పెరిగిందని సంబరపడుతున్న ఆపిల్‌కు షాక్ తగిలింది. తాజాగా విడుదల చేసిన ఐఫోన్ 14 సిరీస్ లో … ఐఫోన్ 14 ప్లస్ కు అస్సలు డిమాండ్ లేకపోవడంతో… దాని తయారీ నిలిపివేయాలని మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలను ఆపిల్ ఆదేశించినట్లు చెబుతున్నారు. ఐఫోన్ 14 ప్లస్ ఫోనే కాదు… గతంలోనూ కొన్ని ఫోన్లకు డిమాండ్ లేకపోవడంతో వాటి తయారీ నిలిపివేసింది… ఆపిల్.

దాదాపు 2 నెలల కిందట ఐఫోన్ 14 సిరీస్ ను విడుదల చేసింది… ఆపిల్. అక్టోబర్లో పండుగ సీజన్ నుంచి దాని అమ్మకాలు ప్రారంభించింది. ఐఫోన్ సిరీస్ లో 14 ప్లస్ కే ఎక్కువ డిమాండ్ ఉంటుందని ఆపిల్ అంచనా వేసింది. ఎందుకంటే 6.7 ఇంచ్ ల డిస్ ప్లేతో పాటు ఎక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీ కారణంగా… ఐఫోన్ 14 ప్లస్ అమ్మకాలు భారీగా జరుగుతాయని ఊహించింది. అనలిస్టులు కూడా… పెద్ద డిస్ ప్లే ఉన్న ఫోన్లకు ఉన్న డిమాండ్, తక్కువ ధర కారణంగా ఐఫోన్ 14 ప్లస్ అమ్మకాలు భారీగా జరుగుతాయని భావించారు. కానీ… సీన్ మొత్తం రివర్సైంది. ఐఫోన్ 14 ప్లస్ కొనేందుకు వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో… ఆపిల్‌ దాని ప్రొడక్షన్‌ తగ్గించినట్లు పలు సంస్థలు బయటపెట్టాయి.

Advertisement

నిజానికి ఐఫోన్ 14 సిరీస్ లో 9 కోట్ల ఫోన్లు ఉత్పత్తి చేయాలని ఆపిల్ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ… ఇప్పుడు అందులో 30 లక్షల ఫోన్ల ఉత్పత్తిని తగ్గించాలని భావిస్తోంది. సేల్స్ లేకపోవడంతో… ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ మోడళ్ల తయారీని 30 లక్షల మేర ఆపిల్ తగ్గించబోతోందని… వివిధ సంస్థలు తమ నివేదికల్లో పేర్కొన్నాయి. గతంలోనూ కొన్ని లేటెస్ట్ వెర్షన్ ఫోన్లకు గిరాకీ లేకపోవడంతో… వాటి ఉత్పత్తిని ఆపిల్ భారీగా తగ్గించింది. ఐ ఫోన్ 8, ఐఫోన్ 12 మినీ మోడళ్లు వినియోగదారులను ఆకట్టుకోకపోవడంతో… ఉత్పత్తి నిలిపివేసింది.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Big Stories

Advertisement
×