Riyan Parag: రాజస్థాన్ రాయల్స్ యంగ్ బ్యాట్స్మెన్ రియాన్ పరాగ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసిన రియాన్ పరాగ్ అద్భుత ప్రదర్శన చేశాడు. 15 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేసిన పరాగ్ 4 హాఫ్ సెంచరీలతో మొత్తం 573 పరుగులు చేశాడు. అతడి ప్రదర్శన కారణంగా ఈసారి రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లే ఆఫ్స్ లోకి ప్రవేశించగలిగింది.
Also Read: Stuart Broad: ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించిన బుమ్రా… ఒకే ఓవర్ లో 35 పరుగులు
రియాన్ పరాగ్ ప్రదర్శన పై కూడా చాలా ప్రశంసలు వచ్చాయి. ఐపీఎల్ 2025 సీజన్ లో తొలి 3 మ్యాచ్లకు రాజస్థాన్ రాయల్స్ తమ కెప్టెన్ గా రియాన్ పరాగ్ పేరును ప్రకటించింది. ఆర్ఆర్ రెగ్యులర్ కెప్టెన్ సంజు శాంసన్ పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో పరాగ్ పేరు ప్రకటించింది. ఆ సమయంలో ఈ నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది. యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ కి అన్యాయం జరిగిందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే రాజస్థాన్ రాయల్స్ తోనే తన ఐపీఎల్ కెరియర్ స్టార్ట్ చేసిన పరాగ్ ఇప్పటివరకు 6 సీజన్లలో 72 మ్యాచ్ లలో 26.17తో 1566 పరుగులు చేశాడు. స్పిన్ బౌలర్ కూడా అయిన పరాగ్ 30 ఇన్నింగ్స్ లలో కేవలం 7 వికెట్లు పడగొట్టాడు. అయితే 2019 నుండి అతడి ప్రదర్శన అంతంత మాత్రమే ఉన్న.. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అతడిని కొనసాగించేందుకు నెపోటిజమే కారణమని విమర్శలు వచ్చాయి.
రియాన్ తండ్రి పరాగ్ దాస్ ఒకప్పటి ఫస్ట్ క్లాస్ క్రికెటర్. అతడు అస్సాం క్రికెట్ లో చక్రం తిప్పుతున్నాడని పరాగ్ దాస్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే పరాగ్ ని మొదటి మూడు మ్యాచ్ లకి కెప్టెన్ గా అనౌన్స్ చేశారని విమర్శలు వచ్చాయి. ఇక పరాగ్ వ్యక్తిగత విషయానికి వస్తే.. గతేడాది చివర్లో ఈ యువ క్రికెటర్ ఓ బాలీవుడ్ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడని రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే.
రియాన్ పరాగ్.. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేని పెళ్లి చేసుకోబోతున్నాడని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అలా కొంతకాలం తర్వాత ఈ ప్రచారం మరుగున పడింది. అయితే ఇప్పుడు మరోసారి రియాన్ పరాగ్ పెళ్లి గురించి రూమర్స్ రావడంతో సోషల్ మీడియాలో ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు. ఒకవేళ రియాన్ పరాగ్ పెళ్లి చేసుకుంటే.. ఆ అమ్మాయి పేరు పాన్ అయితే.. ఆమెని పాన్ పరాగ్ అని పిలవాల్సి ఉంటుందని మీమ్స్ వేస్తున్నారు. ఈ ఫన్నీ మీమ్స్ చూసిన నెటిజెన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.