E-Paper
Advertisement

Anantapur District Gunfire: అనంతపురంలో కాల్పుల కలకలం.. CIపై కత్తితో దాడి

Anantapur District Gunfire: అనంతపురంలో కాల్పుల కలకలం.. CIపై కత్తితో దాడి

Anantapur District Gunfire: అనంతపురం జిల్లాలో పెను కలకలం రేగింది. నిందితుడిని పట్టుకోవడానికి వెళ్లిన సీఐపై కత్తితో దాడి జరగడం..  ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు గాయపడటం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.

ఈ ఉదంతం అనంతపురంలోని అరవింద నగర్ అయ్యప్ప కేఫ్ సమీపంలో మొదలైంది. రాజా, సోహెల్, అక్రమ్, అజయ్ అనే నలుగురు స్నేహితులు కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో రాజా వద్ద ఉన్న మద్యాన్ని అజయ్ అడగగా..  అతను ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన అజయ్, తన వద్ద ఉన్న చిన్న కత్తితో రాజా కడుపులో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన రాజా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ దాడి ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. నిందితుడు అజయ్ ఆకుతోటపల్లి  ఉన్నాడనే సమాచారంతో టూ టౌన్ సీఐ శ్రీకాంత్ తన బృందంతో అక్కడికి చేరుకున్నారు.

పోలీసులను చూడగానే అజయ్ లొంగిపోవడానికి బదులు..  సీఐ శ్రీకాంత్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో సీఐకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సీఐ శ్రీకాంత్  ఆత్మరక్షణ కోసం తన వద్ద ఉన్న రివాల్వర్‌తో అజయ్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అజయ్ కాల్లోకి బుల్లెట్ దూసుకెళ్లింది.

గాయపడిన సీఐ శ్రీకాంత్ , నిందితుడు అజయ్ ఇద్దరినీ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో ఇప్పటికే షేక్ సోహెల్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నేర ప్రవృత్తి కలిగిన వారు పోలీసులపైనే దాడికి తెగబడటం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఉన్నత పోలీస్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ: Balapur Murder: హైదరాబాద్‌లో దారుణం.. అమ్మాయితో ప్రేమ వ్యవహారం, కత్తులతో కిరాతకంగా పొడిచి..?

Related News

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

Big Stories

×