BigTV English

David Warner : గొప్పోడు రా బాబూ.. వార్నర్ క్యాప్ కోసం సీన్ లోకి ఆస్ట్రేలియా ప్రధాని..

David Warner : గొప్పోడు రా బాబూ.. వార్నర్ క్యాప్ కోసం సీన్ లోకి ఆస్ట్రేలియా ప్రధాని..
Cricket news 2024

David Warner : ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సామాజిక మాధ్యమాల్లో నిత్యం ట్రెండింగ్ లో ఉంటాడు. తనకి కష్టం వచ్చినా, ఆనందం వచ్చినా లేక మంచి జరిగినా వెంటనే ప్రజలతో పంచుకుంటాడు. అలా ఇటీవల పోయిన తన బ్యాగ్ తిరిగి దొరికిందని సంతోషంగా తెలిపాడు.


తనకెంతో ప్రాణప్రదమైన బ్యాగీ గ్రీన్ క్యాప్ కూడా దొరికిందని ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్టు పెట్టాడు.
రెండు రోజులుగా గుండెల్లో మోస్తున్న భారం దిగిపోయిందని తెలిపాడు. అంతేకాదు బ్యాగ్ విషయంలో సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలిపాడు.

అయితే బ్యాగ్ దొరికినందుకు అందరూ సంతోషపడ్డారు. ఇంతకీ ఆ బ్యాగ్ ఎక్కడుంది? ఎవరు పట్టుకుపోయారు? ఎవరు తెచ్చి ఇచ్చారని ఆరా తీశారు. అసలు విషయం తెలిసి డంగైపోయారు. ఎందుకంటే మనవాడు తన హోటల్ రూమ్ లోనే జాగ్రత్తగా ఒక చోట పెట్టి మరిచిపోయాడు. ఊరంతా వెతికాడు. దీంతో అందరూ గొప్పోడు రా బాబూ…వార్నర్ అని అనుకున్నారు.


అదక్కడే ఉంది. ఆ బ్యాగ్ వదిలేసి, అన్నీ పట్టుకొచ్చాడు. పాకిస్థాన్‌తో ఆఖరి టెస్టు కోసం మెల్‌బోర్న్ నుంచి సిడ్నీకి వస్తున్న దారిలో బ్యాగ్ మిస్ అయి ఉంటుందని భావించి, క్వాంటమ్ ఎయిర్ లైన్స్ దుంప తెంపేశాడు. అన్ని వందల సీసీ కెమెరాల మధ్యలో వార్నర్ బ్యాగ్ ని ఎవరూ పట్టుకెళ్లినట్టు కనిపించలేదని ఎయిర్ పోర్టు అథారిటీస్ చెప్పాయి. దీంతో అందరూ తలలు పట్టుకున్నారు.

ఈ విషయం, ఈనోటా, ఆ నోటా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ దృష్టికి వెళ్లింది.  ఆయన వెంటనే స్పందించారు. ఆ క్యాప్ చాలా ముఖ్యం. అంతేకాదు డేవిడ్ వార్నర్ వందకు పైగా టెస్ట్ మ్యాచ్ లు దేశం కోసం ఆడి ఎంతో పేరు తెచ్చాడు. తన చివరి టెస్ట్ మ్యాచ్ రోజున ఇలా జరగడం బాధాకరం, వెంటనే దాని సంగతి చూడమని అధికారులకు ఆదేశించారు.

దీంతో పోలీసులు, స్పెషల్ స్క్వాడ్స్ అంతా రంగంలోకి దిగారు. మొదట అసలెక్కడ నుంచి మనవాడు బయలుదేరాడని హోటల్ దగ్గరకి వెళ్లారు. ఆ రూమ్ నంతా చెక్ చేశారు. ఆ బ్యాగ్ ఒక అరలో భద్రంగా కనిపించింది. దీంతో వార్నర్ చేసిన అల్లరి, హంగామా అన్నింటినీ గుర్తుకు తెచ్చుకుని నవ్వుకున్నారు. ఎంతో జాగ్రత్తగా తీసుకొచ్చి వార్నర్ కి అప్పగించారు.

బ్యాగ్ ని చూడగానే డేవిడ్ వార్నర్ ముఖం వేయి వాల్ట్ ల బల్బ్ లా వెలిగింది. వెంటనే ప్రధానమంత్రికి క్రతజ్నతలు తెలిపాడు. దీనిని జీవితాంతం భద్రంగా దాచుకుంటానని నవ్వుతూ తెలిపాడు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×