BigTV English

itel A70: అద్భుతమైన స్మార్ట్‌ఫోన్.. కేవలం రూ.6 వేలకే కొనేయొచ్చు..

itel A70: అద్భుతమైన స్మార్ట్‌ఫోన్.. కేవలం రూ.6 వేలకే కొనేయొచ్చు..

itel A70: కొత్త ఫోన్ కొనుక్కోవాలని చూస్తున్నారా? మీకో గుడ్ న్యూస్. అతి తక్కువ ధరలోనే కొత్త ఫోన్ అందుబాటులో ఉంది. మంచి డిస్కౌంట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ మరింత తక్కువకు సొంతం చేసుకోవచ్చు.


ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ఐటెల్ కంపెనీ ఇటీవల itel A70 పేరుతో అదిరిపోయే కొత్త స్మార్ట్ ఫోన్‌ను రిలీజ్ చేసింది. దీన్ని మూడు వేరియంట్లలో తీసుకు వచ్చింది. ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా అమెజాన్ సైట్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. దీని 4GB/64GB వేరియంట్ ధర రూ. 6,299.. 4GB/128GB వేరియంట్‌ను రూ.6,799.. 4GB/256GB వేరియంట్ ధరను రూ. 7,299గా కంపెనీ నిర్ణయించింది. అంతేకాకుండా బ్యాంక్ ఆఫర్‌లతో ఈ ఫోన్‌ను మరింత తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చునని తెలిపింది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్ బ్లూ, గోల్డ్, గ్రీన్, బ్లాక్ వంటి కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి వచ్చింది.

స్పెసిఫికేషన్స్..


ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్‌రేట్, 500 nits బ్రైట్‌నెస్‌తో కూడిన 6.6-అంగుళాల HD+(1,612 x 720 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఆపిల్ డైనమిక్ ఐలాండ్ వంటి డైనమిక్ బార్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. అలాగే 4GB RAM, 256GB వరకు స్టోరేజ్‌తో ఆక్టా-కోర్ Unisoc T603 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. RAMని వర్చువల్‌గా 12GB వరకు పెంచుకోవచ్చు. అలాగే అదనపు మెమరీ కార్డ్ ద్వారా ఫోన్ మెమరీని 2TB వరకు పెంచుకోవచ్చు. ఇది Android 13 Go ఎడిషన్ ఆధారిత ItelOS 13 పై రన్ అవుతుంది. ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ అమర్చారు. ప్రైమరీ కెమెరా 13MP, AI బ్యాక్డ్ సెకండరీ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. సెల్ఫీ కోసం 8MP కెమెరాను అందించారు. అలాగే 5,000mAh బ్యాటరీని కూడా ఇది కలిగి ఉంది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×