Pakistan Army: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs Pakistan) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్న సంగతి తెలిసిందే. నిత్యం కాశ్మీర్ బార్డర్ లో పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడులకు దిగుతూనే ఉన్నారు. ఇప్పటికే చాలా మంది ఇండియన్స్ ను పొట్టన పెట్టుకున్నారు. ఇటీవల పహల్గామ్ సంఘటన జరగగా… దానికి ఇండియన్ ఆర్మీ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆపరేషన్ సిందూర్ ( Operation Sindoor) పేరుతో చుక్కలు చూపించింది. ఇలా నిత్యం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటూనే ఉంది. అటు రెండు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ లు జరిగిన కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలో మన భారతీయ జెండాను పాకిస్తాన్ ఆర్మీ (Pakistan Army) కింద పడేసి.. నాన రచ్చ చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి.
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs Pakistan) మధ్య గొడవలు జరుగుతున్న క్రమంలో పాకిస్తాన్ ఆర్మీ నిర్వహించిన మాక్ డ్రిల్ ( Pakistan Army Mock Drill ) మరో వివాదానికి తెరలేపింది. పెషావర్ క్రికెట్ స్టేడియంలో తాజాగా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన SSG కమాండోలు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ సిందూర్ లాంటి సంఘటనలు ఎదురవుతే, ఎలా ఎదుర్కోవాలనే దానిపైన కసరత్తులు మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే పెషావర్ క్రికెట్ స్టేడియం వేదికగా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన SSG కమాండోలు నాటకీయా ఆపరేషన్ ప్రదర్శించారు.
జమ్మూ కాశ్మీర్ సరిహద్దులను దాటుకొని ఎలా ముందుకు వెళ్లాలి అనే దాని పైన కూడా ఈ మాక్ డ్రిల్ లో ప్రాక్టీస్ చేసి చూపించారు. ఇండియన్ బార్డర్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత భారత జాతీయ జెండాను తొలగించి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా ఓ డ్రామాను కూడా క్రియేట్ చేశారు. భారతీయ జెండాను కిందపడేసి పాకిస్తాన్ ఫ్లాగ్ ఎగరవేశారు. కాశ్మీర్ ప్రాంతంలోని ఆరు నదులను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఈ ప్రదర్శన ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు పాకిస్తాన్ ఆర్మీ. ఈ నేపథ్యంలోనే ఈ మాక్ డ్రిల్ వైరల్ గా మారింది. దీనిపై ఇండియన్స్ కూడా కౌంటర్ ఇస్తున్నారు. వెయ్యి జన్మలు ఎత్తినా ఇండియా వెంట్రుక కూడా పీకలేరంటూ చురకలు అంటిస్తున్నారు.
దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పాకిస్తాన్ కన్ను జమ్మూ కాశ్మీర్ పైన ఉంది. ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు కాశ్మీర్ ను తమ దేశంలో కలుపుకోవాలన్న కసితో ఉంది పాకిస్తాన్. అయితే పాకిస్తాన్ కంటే వెయ్యి రెట్ల పవర్ఫుల్ అయిన ఇండియా, ఎప్పటికప్పుడు కాశ్మీర్ ను కాపాడుకుంటూనే ఉంది. అదే సమయంలో మన జోలికి వస్తే ఇండియన్ ఆర్మీ చుక్కలు చూపిస్తూనే ఉంది. దీనికి ఉదాహరణ ఆపరేషన్ సిందూర్.
Also Read: PAK VS BAN: షాహీన్ అఫ్రిదిపై ట్రోల్స్…కృనాల్ పాండ్యా కంటే స్లోగా బౌలింగ్ చేస్తున్నాడంటూ
–KiZFv/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==